ఓ శాడిస్టు భర్త కుటుంబ కలహాలతో కోపోద్రిక్తుడై భార్య ముక్కు కొరికేశాడు. దీంతో ఆమె ముక్కు కొనభాగం తెగిపోయింది.
తాండూరు : ఓ శాడిస్టు భర్త కుటుంబ కలహాలతో కోపోద్రిక్తుడై భార్య ముక్కు కొరికేశాడు. దీంతో ఆమె ముక్కు కొనభాగం తెగిపోయింది. వివరాల్లోకి వెళితే ..రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం అల్లాపూర్కు చెందిన వడ్డే బాలకృష్ణయ్య, వెంకటమ్మ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఓ పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు. కుటుంబ కలహాలతో వీరు నిన్న గొడవపడ్డారు. ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన బాలకృష్ణయ్య భార్య ముక్కు కొరికేశాడు. దీంతో ఆమె ముక్కు కొనభాగం తెగి, తీవ్ర రక్తస్రావం అవటంతో బిగ్గరగా కేకలు వేసింది. వెంటనే పక్కనే ఉన్న కార్మికులు ఘటనా స్థలానికి చేరుకోవడటంతో బాలకృష్ణయ్య పారిపోయాడు. బాధితురాలిని తాండూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.