
ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం
వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఏలూరు: వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పరిధిలోని అమ్మపాలెం పెట్రోలుబంకు వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
మేఘనా ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.