కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలకు భక్తులు పోటెత్తారు.
తిరుమల: కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవు దినాలు, పెళ్లిళ్లు ఉండడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 30 గంటల సమయం, దివ్య దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
గదులు దొరకక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులు వెనుదిరుగుతున్నారు. అటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా జరిగాయి. ఈ ఒక్కరోజే 500 పెళ్లిళ్లు జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఆలయ ప్రాంతమంతా కొత్త దంపతులతో సందడిగా కనిపించింది.