
హ్యాపీ రిసార్‌ట అద్భుతం
ఆత్మకూరు గ్రామ పరిధిలో సర్వహంగులతో నూతనంగా నిర్మాణం పూర్తిచేసుకున్న హ్యాపీ రిసార్ట్స్ రిక్రియేషన్ క్లబ్‌ను సినీ హీరోయిన్, ప్రేమకథాచిత్రం ఫేం కుమారి నందిత శనివారం ప్రారంభించారు.
సినీ హీరోయిన్ నందిత
ఆత్మకూరు (మంగళగిరి రూరల్)
ఆత్మకూరు గ్రామ పరిధిలో సర్వహంగులతో నూతనంగా నిర్మాణం పూర్తిచేసుకున్న హ్యాపీ రిసార్ట్స్ రిక్రియేషన్ క్లబ్‌ను సినీ హీరోయిన్, ప్రేమకథాచిత్రం ఫేం కుమారి నందిత శనివారం ప్రారంభించారు. అనంతరం నందిత మాట్లాడుతూ విజయవాడ-గుంటూరు నగరాల మధ్య నిర్మించిన హ్యాపీరిసార్ట్స్ అద్భుతంగా వుందని కొనియాడారు. చిన్నపిల్లల కోసం రెయిన్ డ్యాన్స్, గేమ్స్ జోన్, మినీ జూ, స్విమ్మింగ్‌ఫూల్ తదితర సదుపాయాలు వున్నాయని చెప్పారు. హ్యాపీ రిసార్ట్స్ రిక్రియేషన్స్ క్లబ్ ఈ ప్రాంతవాసులకు మధురానుభూతిని కల్పించేవిధంగా వుందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు.
తమిళంతో పాటు ఇతర భాషల్లో నిర్మించే చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయని, అయితే తెలుగు చిత్రాల్లోనే నటిస్తానని చెప్పారు. తెలుగు చిత్రాల్లో నటించేందుకు పోటీవున్నా తనకు ఎటువంటి సమస్య లేదన్నారు. అనంతరం ఆమె రిసార్ట్స్‌లోని స్విమ్నింగ్‌ఫూల్‌ను సందర్శించి సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో హ్యాపీ రిసార్ట్స్ అధినేత అంబటి మధుమోహనకృష్ణ, డెరైక్టర్లు వాసు, కొండవీటి లక్ష్మణరావు, విజయ్‌సాయి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.