హజ్ కరపత్రాలు విడుదల | Hajj pamphlets released | Sakshi
Sakshi News home page

హజ్ కరపత్రాలు విడుదల

Aug 30 2013 5:32 AM | Updated on Sep 1 2017 10:17 PM

ఆస్తానే బుఖారియా పీఠంలో గురువారం హజ్ యాత్ర సూచనలు గల కరపత్రాలను పీఠాధిపతి ముస్తఫా హుసేని బుఖారి ఆవిష్కరించారు.

కడప కల్చరల్, న్యూస్‌లైన్ : ఆస్తానే బుఖారియా పీఠంలో గురువారం హజ్ యాత్ర సూచనలు గల కరపత్రాలను పీఠాధిపతి ముస్తఫా హుసేని బుఖారి ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన నగర ప్రముఖులు ఏఎస్ సాహెబ్‌జాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్ర హజ్ యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరపత్రాల్లో పొందుపరిచామని వివరించారు.
 
 పీఠాదిపతి ముస్తఫా హుసేని బుఖారి మాట్లాడుతూ హజ్ యాత్రచేయడంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, ప్రార్థనా విధానాలు ఈ కరపత్రంలో ఉన్నాయని, వాటిని యాత్రికులు పాటించాలన్నారు. కరపత్రాలు ముస్లిం ఆర్ఫనైజ్‌లో ఉచితంగా లభిస్తాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మునీర్ హుస్సేన్, రాయల్ రషీద్, హుసేని ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement