జేసీ దౌర్జన్యంపై అశోక్‌ గజపతిరాజు స్పందించాలి | Gudivada Amarnath fire on TDP govt | Sakshi
Sakshi News home page

జేసీ దౌర్జన్యంపై అశోక్‌ గజపతిరాజు స్పందించాలి

Jun 16 2017 4:57 AM | Updated on Aug 9 2018 8:43 PM

విశాఖపట్నం విమానాశ్రయంలో సిబ్బం దిపై దౌర్జన్యానికి పాల్పడిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యవహారంపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు స్పందించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు.

విశాఖ సిటీ : విశాఖపట్నం విమానాశ్రయంలో సిబ్బం దిపై దౌర్జన్యానికి పాల్పడిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యవహారంపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు స్పందించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. గతంలో గన్నవరం విమానాశ్రయంలోనూ ఇదే తరహాలో దాడులకు తెగబడ్డారనీ, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర ఎంపీ విషయంలో వ్యవహరించినట్లుగానే జేసీపైనా చర్యలు తీసుకోవాలన్నారు.

 ప్రింటర్‌ను పైకెత్తి ఇండిగో సిబ్బందిపై నోటికొచ్చినట్లు దుర్భాషలాడినట్లు సాక్ష్యాలు పక్కాగా ఉన్నప్పటికీ మాట మార్చడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. వాస్తవాలు తారు మారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇండిగో సిబ్బందికి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలనీ, దీంతో పాటు కేంద్ర పౌరవిమానయాన శాఖ జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement