తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మె చేపట్టనున్నారు.
ఇందూరు, న్యూస్‌లైన్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మె చేపట్టనున్నారు. దీంతో జిల్లాలోని 2,410 అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు,బాలింతలకు, పిల్లలకు అందించాలిన పౌష్టికాహారంతోపాటు, సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. వారం రోజుల పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు విధుల్లోకి వెళ్లకుండా కేంద్రాలన్నింటికి తాళాలు వేసి ఆందోళనలో పాల్గొననున్నారు.
అంగన్‌వాడీ ఉద్యోగులు తీర్మానం చేసిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం మొదటి దశగా సోమవారం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట, అన్ని సీడీపీఓ ప్రాజెక్టు కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలుపనున్నారు. జిల్లాలోని అంగన్‌వాడీ ఉద్యోగులందరు ఈ ఆందోళన కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.