నాలుగున్నర కిలోల డైజోఫాం పట్టివేత | four and a half kilos dojo form possession | Sakshi
Sakshi News home page

నాలుగున్నర కిలోల డైజోఫాం పట్టివేత

Dec 27 2013 11:18 PM | Updated on Mar 28 2018 10:59 AM

నాలుగున్నర కిలోల నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తాండూరు ఎక్సైజ్ సీఐ భరత్‌భూషణ్ పేర్కొన్నారు.

తాండూరు, న్యూస్‌లైన్: నాలుగున్నర కిలోల నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తాండూరు ఎక్సైజ్ సీఐ భరత్‌భూషణ్ పేర్కొన్నారు. వివరాలివీ... పట్టణంలోని శాంత్‌మహల్ చౌరస్తా ఎదురుగా ఉన్న శ్రీకాళికాదేవి దేవాలయం సమీపంలో ఓ వ్యక్తి వద్ద మత్తుపదార్థం ఉన్నట్టు  శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. ఈమేరకు సీఐతోపాటు ఎస్‌ఐలు సత్యనారాయణ, బాలాజీ, సహదేవ్ తనిఖీలు నిర్వహించగా ఐదు ప్లాస్టిక్ కవర్లలో కల్లులో మత్తు కోసం కలిపే డైజోఫాం లభించింది.

వెంటనే మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకొని, సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు పెద్దేముల్ మండలం గాజీపూర్ సర్పంచ్ ఆనందమ్మ భర్త  సాయిల్‌గౌడ్ అని తేలిందని, అతడిని శనివారం కోర్టులో హాజరుపరుస్తామని సీఐ చెప్పారు. మత్తుపదార్థాన్ని మహారాష్ట్రకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చి వెళ్లినట్టు విచారణలో వెల్లడైందన్నారు. కాగా, సాయిల్‌గౌడ్ అరెస్టుపై సన్నిహితులు  ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. 

Advertisement

పోల్

Advertisement