సముద్రంలో 20 గంటలకు పైగా...

Fishermen Boat Aciident in Vizianagaram Beach - Sakshi

చింతపల్లి తీరంలో నాటు పడవ బోల్తా..

బిక్కుబిక్కుమంటూ గడిపిన మత్స్యకారుడు

మెరైన్‌ పోలీసుల సహకారంతో బయటకు వచ్చిన యువకుడు

విజయనగరం, పూసపాటిరేగ: చింతపల్లి బర్రిపేటకు చెందిన నాటుపడవ ఆచూకీ భోగాపురం మండలం ముక్కాం సముద్రం రేవులో చింతపల్లి మెరైన్‌ పోలీసులకు లభించింది. వివరాల్లోకి వెళితే.. చింతపల్లి బర్రిపేట గ్రామానికి చెందిన  మైలపల్లి అప్పన్న (30) ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సముద్రంలో వేటకు నాటుపడవపై వెళ్లాడు. చింతపల్లి తీరంలో వేట చేస్తుండగా బోల్తాపడిన నాటు పడవ గాలులకు ముక్కాం తీరం వైపు కొట్టుకెళ్లిపోయింది. అయితే అప్పన్న ఎంత గట్టిగా కేకలు వేసినా సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో ఎముకలు కొరికే చలిలో సుమారు 20 గంటల పాటు గడిపాడు. పడవ గల్లంతు విషయం తెలుసుకున్న మెరైన్‌ ఎస్సై జి.రామారావు సిబ్బందితో సహా గ్రామానికి చేరుకున్నారు. అనంతరం పలువురు మత్స్యకారులతో 20 ఇంజిన్‌ పడవలపై గాలించగా.. ముక్కాంనకు 12 కిలోమీటర్లు దూరంలో సముద్రంలో నాటుపడవపై ఉన్న అప్పన్న కనిపించాడు. వెంటనే అతడ్ని క్షేమంగా ఒడ్డుకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితుడ్ని జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు బర్రి చినప్పన్న, మత్స్యకార నాయకులు మైలపల్లి సింహాచలం, మైలపల్లి తాతలు పరామర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top