నగరంలోని నెహ్రూపార్క్ వద్దగల సన కలెక్షన్ వస్త్ర దుకాణంలో గురువారం ఉదయం 7గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్: నగరంలోని నెహ్రూపార్క్ వద్దగల సన కలెక్షన్ వస్త్ర దుకాణంలో గురువారం ఉదయం 7గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్టేషన్ ఫైర్ అధికారి విజయ్‌శేఖర్ తెలిపారు. వివరాలు.. దుకాణం యాజమాని రవూఫ్ బుధవారం రాత్రి దుకాణాన్ని మూసి వెళ్లారు. గురువారం ఉదయం ఆయన దుకాణం నుంచి వస్తున్న పొగలను గమనించిన స్థానికులు సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి, ఒకటోటౌన్ పోలీసులకు అందించారు.
దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అర్పారు. అయితే అప్పటికే దుకాణంలో ఉన్న వస్త్రాలు పూర్తిగా కాలిపోయాయి. సన కలెక్షన్‌లోని మొదటి అంతస్తులోగల కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎలాంటి ఆస్తి నష్టం జరుగకుండా అగ్నిమాపక సిబ్బంది అన్ని విధాలా చర్యలు తీసుకున్నారు. బాధితుడు రవూఫ్ ఫిర్యాదు మేరకు అగ్నిమాపకశాఖాధికారులు కేసు నమోదు చేసుకుని పంచనామా నిర్వహించారు. రూ. 20లక్షల వస్త్రాలతోపాటు రూ. 5లక్షల ఫర్నిచర్ కాలిపోయినట్లు నిర్దారించామని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ విజయ్‌శేఖర్ తెలిపారు.