గూడ్స్ రైలులో మంటలు | fire accident at goods train in pundi railway station in srikakulam distirict | Sakshi
Sakshi News home page

గూడ్స్ రైలులో మంటలు

Feb 19 2015 4:48 PM | Updated on Sep 5 2018 9:45 PM

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు ఇంజిన్‌లో మంటలు రేగాయి.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు ఇంజిన్‌లో  గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. పలాస నుంచి విశాఖ వైపు బొగ్గుతో వెళ్తున్న రైలు స్టేషన్‌లో ఆగి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలింజన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు రేగటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంజిన్ కాలిపోవడంతో రూ.30 లక్షల మేర నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.
(వజ్రపుకొత్తూరు)

Advertisement
 
Advertisement
Advertisement