పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి | Father and Son died due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి

Jun 4 2015 7:12 PM | Updated on Sep 2 2018 4:48 PM

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృత్యువాతపడ్డారు.

రేగిడి (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పెద్దసిర్లాం గ్రామానికి చెందిన కోడుబోయిన సంగం(55), అతని కుమారుడు బంగారి(38) మేకలు మేపేందుకు గురువారం మధ్యాహ్నం పొలాలకు వెళ్లారు. కాగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. అదే సమయంలో పొలంలో మేకలు మేపుతున్న సంగం, బంగారిపై పిడుగు పడటంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. కాగా పిడుగు శబ్దానికి మేకలు తలోదిక్కు పరుగు తీశాయి.

Advertisement
 
Advertisement
Advertisement