పంటలు దెబ్బతిని అప్పులు పెరిగిపోవడంతో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు(32) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
బహ్మసముద్రం (అనంతపురం): పంటలు దెబ్బతిని అప్పులు పెరిగిపోవడంతో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు(32) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాసులుకు ఉన్న మూడు ఎకరాల్లో గత కొన్నేళ్లుగా టమాట పంట సాగు చేసి నష్టం చవిచూశాడు.
సుమారు రూ. 5 లక్షల దాకా అప్పుల పాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. ఎంతకూ ఇంటికి రాకపోయే సరికి భార్య అరుణ తోటకు వెళ్లి చూసేసరికి విషమ పరిస్థితుల్లో ఉన్నాడు. బంధువుల సాయంతో కళ్యాణదుర్గం అస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు.