బోగస్ ఫేస్‌బుక్ అకౌంట్ వ్యవహారంలో నిందితులు ఎవరై ఉంటారనే విషయంలో పోలీసులు మరింత లోతుగా పోలీసులు విచారణ చేపట్టారు.
కోరుట్ల, న్యూస్‌లైన్ : బోగస్ ఫేస్‌బుక్ అకౌంట్ వ్యవహారంలో నిందితులు ఎవరై ఉంటారనే విషయంలో పోలీసులు మరింత లోతుగా పోలీసులు విచారణ చేపట్టారు. బోగస్ ఫేస్‌బుక్ అకౌంట్‌తో గుర్తు తెలియని వ్యక్తి కోరుట్ల పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులను బ్లాక్‌మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే.
బుధవారం కోరుట్ల పట్టణానికి చెందిన యువకునితోపాటు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మరో యువకున్ని ఇదే కేసులో అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో బోగస్ ఫేస్‌బుక్ అకౌంట్ నడుపుతున్నట్టు భావిస్తున్న మరో యువకుడు దుబయ్ వెళ్లినట్లు సమాచారం అందడంతో అతడిని ఇక్కడికి రప్పించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యక్తిని మరో రెండు రోజుల్లో కోరుట్లకు రప్పిస్తున్నట్లు తెలిసింది.