వైఎస్సార్ జిల్లా కడప నగరంలో ఎక్సైజ్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు.
కడపలో ఎక్సైజ్ దాడులు
Dec 8 2015 12:16 PM | Updated on Jul 11 2019 8:43 PM
కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరంలో ఎక్సైజ్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఎక్సైజ్ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ విజయకుమారి ఆధ్వర్యంలో నగరంలోని బార్లలో సోదాలు జరుపుతున్నారు. విజయవాడలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందిన నేపధ్యంలో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. బార్లలో మద్యం నిల్వలను , వాటి నాణ్యతను పరిశీలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 బార్లు ఉండగా, కడప నగరంలో 5 బార్లు ఉన్నాయి.
Advertisement
Advertisement