పూర్తిస్థాయి విచారణ చేస్తాం: రమేశ్‌నాథ్ | enquiry is going on, says doctor rameshnath | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయి విచారణ చేస్తాం: రమేశ్‌నాథ్

Nov 18 2016 10:58 AM | Updated on Sep 4 2017 8:27 PM

పూర్తిస్థాయి విచారణ చేస్తాం: రమేశ్‌నాథ్

పూర్తిస్థాయి విచారణ చేస్తాం: రమేశ్‌నాథ్

‘సాక్షి’ కథనంపై జిల్లా ఆస్పత్రుల కో ఆర్డినేటర్ డాక్టర్ రమేశ్‌నాథ్ స్పందించారు.

అనంతపురం: గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై విచారణ మొదలైంది. ‘మంట కలసిన మానవత్వం’ శీర్షికతో ‘సాక్షి’ గురువారం కథనంపై జిల్లా ఆస్పత్రుల కో ఆర్డినేటర్ డాక్టర్ రమేశ్‌నాథ్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి కొందరిపై చర్యలు తీసుకున్నామని, పూర్తిస్థాయి విచారణ ప్రారంభించినట్లు కో ఆర్డినేటర్ చెప్పారు. నడవలేని పరిస్థితిలో ఉన్న షేషెంట్‌కు వీల్ చెయిర్ ఇవ్వని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే స్టాఫ్ నర్సు విమలను సస్పెండ్ చేసిన ఆయన, ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ హరిప్రసాద్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. డాక్టర్ గంగన్నకు ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

గుంతకల్లులోని తిలక్‌నగర్ మదీనా మసీదు ప్రాంతానికి చెందిన శ్రీనివాసాచారి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా డు. భర్తను శ్రీవాణి ఆస్పత్రికి బుధవారం తీసుకెళ్లింది. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిని ఎంత కోరినా స్ట్రెచర్ ఇవ్వక పోవడంతో భర్తను ఈడ్చుకుంటూనే మొదటి అంతస్తుకు తీసుకెళ్లింది. 'సాక్షి' కథనంతో స్పందించిన జిల్లా కో ఆర్డినేటర్ రమేశ్‌నాథ్ ఆ ఘటనకు కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

పోల్

Advertisement