
డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ గుండ్రా సతీష్‌రెడ్డి శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.
సాక్షి, అమరావతి: డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ గుండ్రా సతీష్‌రెడ్డి శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన సీఎం వైఎస్ జగన్‌తో పలు కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్రంలోని రక్షణ రంగ ప్రాజెక్టులపై ఇరువురి మధ్యా చర్చ జరిగినట్టు సమాచారం. నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రం నిర్మాణం తదితర ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రికి సతీష్‌రెడ్డి వివరించినట్టు తెలిసింది. ఆయనకు సీఎం జగన్ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. (చదవండి: ముందే సంక్రాంతి)