
చంద్రబాబుది దుర్బుద్ధి: పురందేశ్వరి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిది దుర్బుద్ధి అని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
బి.కొత్తకోట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిది దుర్బుద్ధి అని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పి. మాణిక్యాలరావు అధ్యక్షతన ఏర్పాటైన కరువు పరిశీలన బృందం సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె కూడలికి చేరుకుంది. ఇక్కడి జనసమూహాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడిన తరువాత పురందేశ్వరి ప్రసంగించారు.
ప్రారంభంలోనే.. ‘‘యథారాజా తథా ప్రజా.. రాజు మంచివాడై ఉండాలి. సంకల్పం మంచిదైతే అంతా మంచే జరుగుతుంది’’ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి సరైన పద్ధతిలో వినతులు వెళితే వాటి పరిష్కారానికి కేంద్రం మొగ్గుచూపుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సంకల్పం మంచిది కాకపోవడమే రాష్ట్రంలో ప్రస్తుతం దుర్భరమైన కరువు పరిస్థితులు నెలకొనడానికి కారణమంటూ పరోక్షంగా చంద్రబాబు పేరు ప్రస్తావించకుండానే ఆమె విమర్శించారు.