p. Manikyala Rao
-
కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాఫేల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ శాఖ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాఫేల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చౌకీదార్ చోర్ హై అని రాహుల్‌గాంధీ అనడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. రాఫేల్ తీర్పుపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. మరోవైపు చంద్రబాబు ఇసుక దీక్షపై స్పందిస్తూ.. గతంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. చిత్తశుద్ధిలేని దీక్షలు చేస్తూ చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
మంత్రి మాణిక్యాలరావు, బోండా ఉమా మధ్య వాగ్వివాదం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మధ్య శుక్రవారం విజయవాడలో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. బెజవాడ దుర్గ గుడి ఈవో నర్సింగరావు వేధింపులతో ఆసుపత్రి పాలై... చికిత్స పొందుతున్న అర్చకుడు మంగళంపల్లి సుబ్బారావును శుక్రవారం మంత్రి మాణిక్యాలరావు పరామర్శించారు. అయితే ఈవో నర్సింగరావుపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని దుర్గ గుడి అర్చకులు విజయవాడలో ఆందోళకు దిగారు.ఈవోపై చర్యలు తీసుకుంటాం... ఆందోళన విరమించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు వారికి హామీ ఇచ్చారు. ఈవోపై చర్యలు తీసుకుంటే కానీ తాము ఆందోళన విరమించమని అర్చకులు భీష్మించుకుని కూర్చున్నారు. ఇంతలో అక్కడికి మంత్రి మాణిక్యాలరావు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న అర్చకులను ఆయన కలిశారు. ఈవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న బోండా ఉమా జోక్యం చేసుకుని ఈవోపై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాలని మాణిక్యాలరావును డిమాండ్ చేశారు. అందుకు ఆయన ససేమీరా అన్నారు. నివేదిక రాకుండా ఆయన్ని ఎలా సస్పెండ్ చేస్తామంటూ మాణిక్యాలరావు ఎమ్మెల్యే బోండాను ప్రశ్నించారు. దీంతో బోండా ఉమా ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. -
చంద్రబాబుది దుర్బుద్ధి: పురందేశ్వరి
బి.కొత్తకోట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిది దుర్బుద్ధి అని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పి. మాణిక్యాలరావు అధ్యక్షతన ఏర్పాటైన కరువు పరిశీలన బృందం సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె కూడలికి చేరుకుంది. ఇక్కడి జనసమూహాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడిన తరువాత పురందేశ్వరి ప్రసంగించారు. ప్రారంభంలోనే.. ‘‘యథారాజా తథా ప్రజా.. రాజు మంచివాడై ఉండాలి. సంకల్పం మంచిదైతే అంతా మంచే జరుగుతుంది’’ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి సరైన పద్ధతిలో వినతులు వెళితే వాటి పరిష్కారానికి కేంద్రం మొగ్గుచూపుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సంకల్పం మంచిది కాకపోవడమే రాష్ట్రంలో ప్రస్తుతం దుర్భరమైన కరువు పరిస్థితులు నెలకొనడానికి కారణమంటూ పరోక్షంగా చంద్రబాబు పేరు ప్రస్తావించకుండానే ఆమె విమర్శించారు. -
కలిసుంటే... కాసులపంటే..
సాక్షి, విజయవాడ : రెండు శాఖల మధ్య సమన్వయ లోపం జిల్లాలో పర్యాటకాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారింది. ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని చెబుతున్నారు. మరోవైపు ‘టెంపుల్ టూరిజం’ అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు ప్రకటించారు. అయితే, పర్యాటక, దేవాదాయ శాఖల మధ్య సమన్వయలోపం వల్ల పాల కుల ప్రకటనలు ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యాయి. కీలకమైన కార్యక్రమాలను ఎవరికి వారే వేర్వేరుగా నిర్వహించుకుంటున్నారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రెండు శాఖలు కలిసి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడంలేదు. రెండు శాఖల అధికారులు కలిసి కార్యక్రమాలు రూపొందిస్తే కాసుల పంట పండుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు వచ్చినా... ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రోజూ రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీరికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చూడదగిన ప్రదేశాల వివరాలు తెలియజేసేందుకు దేవాదాయ, పర్యాటక శాఖలు చర్యలు తీసుకోవడంలేదు. కొం దరు భక్తులు దుర్గగుడి అధికారులను అడిగినా పర్యాటక శాఖ ప్యాకేజీలు తమకు తెలియవని బదులిస్తున్నారు. దీంతో భక్తు లు అమ్మవారిని దర్శించుకుని వెళ్లిపోతున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యాన ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేసి జిల్లాలో దర్శనీయ ప్రదేశాలు, తమ శాఖ ప్యాకేజీల గురించి వివరిస్తే వాటిని తిలకిం చాలని భక్తులకు ఆసక్తి గలిగే అవకాశం ఉంటుంది. ఇతర రాష్ట్రాల భక్తులు పర్యాటక శాఖ ఆధ్వర్యాన పర్యటిస్తున్న సమయంలో దుర్గగుడి వివరాలు అడిగినా చె ప్పడం లేదని తెలుస్తోంది. ఈ రెండు శాఖ లు పరస్పరం సహకరించుకుం టే ఆదా యం భారీగా పెరిగే అవకాశం ఉంది. దుర్గగుడిని కలుపుతూ ప్యాకేజీ లేదు రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయం అయిన దుర్గగుడిని కలుపుతూ పర్యాటక శాఖ ఏ విధమైన ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పటి వరకు రూపొందించలేదు. దసరా ఉత్సవాలు, భవానీ దీక్షల విరమణ సమయంలో ఎంతోమంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తారు. ఆ సమయంలో అమ్మవారి ప్రత్యేక దర్శనంతోపా టు కృష్ణా, గుంటూరు జిల్లాలోని ముఖ్య దేవాలయాలను సందర్శించే విధంగా పర్యాటక శాఖ ప్యాకేజీలు తయారు చేయవచ్చు. కార్తీక మాసంలోనూ అంతే.. కార్తీకమాసంలో ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పంచారామాలకు భక్తులను తీసుకెళ్తుంది. పర్యాటక శాఖ కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించుకుంటోంది. భవానీ ద్వీపానికి ఇతర ప్రాంతాల నుంచి వనభోజనాలకు వచ్చే భక్తుల్లో చాలా తక్కువ మంది మాత్రమే దుర్గగుడికి వెళ్తున్నారు. వీరు దుర్గమ్మను దర్శించుకునేలా పర్యాటక శాఖ కార్యక్రమాలు రూపొం దించే అవకాశం ఉంది. గదులు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు... దుర్గగుడికి వచ్చే భక్తులకు రూముల కొరత తీవ్రంగా ఉంది. నగరంలో హోటళ్లలో దిగి అమ్మవారి దర్శనానికి రావాల్సి వస్తోంది. భవానీ ద్వీపంలో, పున్నమి గార్డెన్స్‌లోని పర్యాటక శాఖ రూములు ఖాళీగా ఉంటున్నాయి. ఈ రెండు శాఖల మధ్య సమన్వ యం ఉంటే భక్తులకు ఇబ్బంది లేకుండా రూమ్‌లు సర్దుబాటు చేసే అవకాశం ఉంది. కాగితాలకే పరిమితమైన రోప్‌వే పర్యాటక శాఖ ఆధ్వర్యాన సీతమ్మవారి పాదాల నుంచి దుర్గగుడికి రోప్ వే ఏర్పాటుకు ప్రతిపాదనలు అర్ధ శతాబ్దంగా ఉన్నా యి. దుర్గగుడికి వచ్చే భక్తులకు ఉపయోగపడుతుంది. రెండు శాఖల మధ్య సమన్వ యం లేకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు కేవలం కాగితాలకే పరిమితమైంది. ఇప్పటికైనా రెండు శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తే ఆదాయాన్ని పెంచుకోవచ్చు.