విజయనగరం జిల్లాలో గ్రామసభ రసాభాస | communist leaders arrested in vizianagaram over nvs pharma company compensation | Sakshi
Sakshi News home page

విజయనగరం జిల్లాలో గ్రామసభ రసాభాస

Feb 8 2017 11:42 AM | Updated on Sep 5 2017 3:14 AM

విజయనగరం జిల్లా పువ్వాడ గ్రామసభలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పూసపాటిరేగ మండలం పువ్వాడ గ్రామంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. ఎన్‌వీఎస్‌ ఫార్మా కంపెనీ పర్యావరణ అనుమతుల కోసం బుధవారం గ్రామసభ నిర్వహించింది. ఈ సభలో రైతులు ఆందోళనకు దిగడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

భోగాపురం ఎయిర్‌పోర్టు బాధితులకు ఇచ్చిన విధంగానే తమకు నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ డిమాండ్‌కు అంగీకరిస్తేనే భూములు ఇస్తామని వారు తేల్చి చెబుతున్నారు. రైతులకు స్థానిక వామపక్ష నేతలు మద్దతుగా నిలిచారు. గ్రామసభలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వామపక్ష నేతలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement