108 సిబ్బందికి శుభవార్త.. భారీగా జీతాలు పెంపు

CM YS Jagan Announces Salary Hike For 108 Drivers - Sakshi

టెక్నీషియన్లకు రూ. 20 వేల నుంచి 30 వేల వరకు పెంపు

సాక్షి, అమరావతి : ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108 అంబులెన్స్‌ డ్రైవర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. డ్రైవర్లకు జీతాలను భారీగా పెంచారు. సర్వీసుకు అనుగుణంగా డ్రైవర్ల జీతాన్ని రూ.18 నుంచి 28 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..‌ 108 సిబ్బంది జీతాలు పెంచబోతున్నట్లు ప్రకటించారు.  (చదవండి : ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభం)

ఇంతకు ముందుకు డ్రైవర్లకు నెలకు రూ.10వేలు జీతం వస్తుండగా, ఇకపై వారి సర్వీసుకు అనుగుణంగా రూ.18వేల నుంచి 28వేల రూపాయల వరకు అందనుంది. అలాగే ఎమెర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల జీతాలను కూడా పెంచుతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ప్రస్తుతం రూ.12వేల జీతం అందుకుంటున్న మెడికల్‌ టెక్నీయన్‌ ఇకపై రూ.20 వేల నుంచి 30 వేల వరకు అందుతుందని సీఎం జగన్‌ చెప్పారు. పెంచిన జీతాలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

అంతకు ముందు సీఎం జగన్‌ ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్‌ సర్కిల్‌లో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లిపోయాయి.  ప్రతి మండలానికి కొత్తగా 104, 108 వాహనాలు కేటాయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top