ఉద్యోగాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన శ్రవణ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కడప : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన శ్రవణ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ శ్రవణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల నిరుద్యోగ యువతకు వల వేసి వారి వద్ద నుంచి రూ.7 కోట్లు వసూలు చేశాడు. ఇతడు ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడు. బాధితుల ఫిర్యాదు మేరకు శ్రావణ్ కుమార్ రెడ్డిని పోలీసులు నందలూరులో పట్టుకున్నారు. అతనిడి పోలీసులు విచారిస్తున్నారు.