హైదరాబాద్ తిరిగొచ్చిన చంద్రబాబు | Chandra babu returns Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ తిరిగొచ్చిన చంద్రబాబు

Sep 22 2014 10:43 PM | Updated on Sep 4 2018 5:15 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చత్తీస్గఢ్ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ తిరిగొచ్చారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చత్తీస్గఢ్ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ తిరిగొచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.

నయారాయపూర్ నిర్మాణాన్ని పరిశీలించామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని చత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరినట్టు చంద్రబాబు తెలిపారు. రాయపూర్ నుంచి విశాఖ వరకు రోడ్ లింకేజ్ గురించి చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్తో చర్చించినట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement