హిందూపురంలో కేంద్ర కరువు బృందం పర్యటిస్తోంది.
అనంతపురం: హిందూపురంలో కేంద్ర కరువు బృందం పర్యటిస్తోంది. హంద్రీ-నీవాను వెంటనే పూర్తి చేసి, జిల్లాకు నీరందించాలని జిల్లా జలసాధన సమితి ప్రతినిధులు కేంద్ర బృందానికి ఒక వినతి పత్రం అందజేశారు.
మోడల్ కాలనీలోని మహిళలతో కేంద్ర బృందం ముఖాముఖి మాట్లాడింది. తాగునీటి సమస్యలను అడిగి తెలుసుకుంది. ఏడు నియోజకవర్గాలలో కరువు పరిస్థితులను కేంద్ర బృందం అధ్యయనం చేయనుంది.