ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
చంద్రబాబును బొజ్లల నిలదీయాలి: చెవిరెడ్డి
Jun 11 2014 8:37 PM | Updated on Apr 3 2019 5:55 PM
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే తెలుగుదేశం నాయకులపై ప్రజల తిరుగుబాటు తప్పదని చెవిరెడ్డి అన్నారు.
దమ్ముంటే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని చంద్రబాబును బొజ్జల ప్రశ్నించాలని చెవిరెడ్డి సూచించారు. కేవలం కీలక మంత్రి పదవిని ఆశించడానికే జగన్‌పై బొజ్జల ఆరోపణలు చేశాడని చెవిరెడ్డి విమర్శించారు. అయినా చంద్రబాబు చేతిలో ఆయనకు భంగపాటు తప్పలేదని చెవిరెడ్డి అన్నారు.
Advertisement
Advertisement