‘బెల్ట్’తీయండి | Belt boutiques Siege | Sakshi
Sakshi News home page

‘బెల్ట్’తీయండి

Jun 25 2014 1:24 AM | Updated on Jul 11 2019 8:43 PM

‘బెల్ట్’తీయండి - Sakshi

‘బెల్ట్’తీయండి

జిల్లాలోని మారుమూల గ్రామాల్లో బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సహాయ కమిషనర్ టి.శ్రీనివాసరావు తెలిపారు.

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సహాయ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశం
ఇప్పటివరకు 106 బెల్ట్ షాపుల సీజ్
పెందుర్తి, గాజువాకల్లోనే 28 మంది అరెస్టు
నర్సీపట్నంలో 16 బెల్ట్ దుకాణాలు సీజ్

 
విశాఖపట్నం : జిల్లాలోని మారుమూల గ్రామాల్లో బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సహాయ కమిషనర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఎక్సైజ్ కార్యాలయంలో బెల్ట్ షాపుల నియంత్రణ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 23వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 106 బెల్ట్ షాపులను మూసివేయించి, కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. అలాగే 1,583 మద్యం బాటిళ్లను పట్టుకున్నామని చెప్పారు. పెందుర్తి, గాజువాకల్లో అత్యధికంగా 28 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. విశాఖ అర్బన్‌లో 12, నర్సీపట్నంలో 16 బెల్ట్ దుకాణాలు మూయించామన్నారు. మొదటి వారం రోజుల్లో 64 కేసులు న మోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆ తర్వాత అదే ఊపు కొనసాగించలేకపోయిందన్నారు. మళ్లీ అదే ఊపుతో పనిచేయాలని సూచించారు. చోడవరం, మాడుగుల, చింతపల్లి, పాయకరావుపేట, పాడేరు, అరుకు ప్రాంతాల్లో కేసులు తక్కువగా నమోదవుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో విశాఖ జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదయినట్టు ప్రభుత్వం గుర్తించిందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement