నగరంలో మంజునాథ కమిషన్ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది.
మంజునాథ కమిషన్ సమావేశం రసాభాస
Mar 22 2017 5:01 PM | Updated on Oct 9 2018 4:20 PM
కాకినాడ: నగరంలో బుధవారం మంజునాథ కమిషన్ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. కాపులను బీసీలను చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ మంజునాథ్ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. కాగా, కమిషన్ చేపట్టిన కార్యక్రమాన్ని కొందరు బీసీ నేతలు బహిష్కరించారు. కాపులతో రిజర్వేషన్లపై జరిగిన చర్చల్లో వివక్ష చూపించినట్లు ఆరోపించారు. ఇరువర్గాలు వాదనలు వినిపించే విషయంలో కాపులతో ఒక విధంగా.. మిగిలిన వారితో మరోలా కమిషన్ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement


