కడప కలెక్టరేట్ వద్ద ఆమరణ దీక్షకు దిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
వైఎస్సార్‌జిల్లా: కడప కలెక్టరేట్ వద్ద ఆమరణ దీక్షకు దిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర మద్దతుగా ఆమరణ దీక్షకు దిగిన వివేకానంద రెడ్డి, నిత్యానంద రెడ్డిలకు నగరంలోని ప్రముఖ వైద్యులు కూడా సంఘీభావం ప్రకటించారు. కాగా, కొందరు విద్యార్థులు రిమ్స్(రాయచూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) కళాశాల పేరును రాయలసీమ మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌గా మార్చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మౌనాన్ని మంగళవారం ప్రశ్నించిన వివేకానంద రెడ్డి సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆమరణ దీక్షకు దిగారు. పదవీ కాంక్షతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదని వివేకా విమర్శించిన సంగతి తెలిసిందే.