ఏటీఎం ను పగులగొట్టి చోరీకి విఫలయత్నం | Attempts to break down the stolen ATM | Sakshi
Sakshi News home page

ఏటీఎం ను పగులగొట్టి చోరీకి విఫలయత్నం

Dec 15 2013 3:05 AM | Updated on Sep 17 2018 6:26 PM

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో మిషన్‌ను పగులగొట్టి చోరీకి విఫలయత్నం చేసి ఓ దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు.

ఉరవకొండ, న్యూస్‌లైన్ : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో మిషన్‌ను పగులగొట్టి చోరీకి విఫలయత్నం చేసి ఓ దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు. శనివారం స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయుంలో సీఐ యుల్లంరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. శుక్రవారం అర ్ధరాత్రి ఉరవకొండ పట్టణానికి చెందిన పులి రావూంజనేయుులు సెక్యూరిటీ లేని ఏటీఎం కేంద్రం లోపలకు వెళ్లి, మిషన్‌ను రాడ్‌తో పగులగొట్టి డబ్బు చోరీ చేసేందుకు యత్నించాడు. అయితే అది ఎంతకూ తెరచుకోలేదు.
 
 దీంతో ఎంత సేపటికీ డబ్బు బయటకు రాకపోవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోతుండగా రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు లోకేష్, రాజన్న గమనించారు. ఆ సమయంలో ఏటీఎం మిషన్ కింది భాగంలోని షట్టర్ తెరుచుకుని ఉండడంతో అనుమానించి రావూంజనేయుులును వెంటాడి పట్టుకున్నారు. నిందితుడు గతంలో దొంగతనాలు చేసేవాడని సీఐ వెల్లడించారు. సమయ స్ఫూర్తితో దొంగను పట్టుకున్న కానిస్టేబుళ్లకు సీఐ నగదు రివార్డును అందజేశారు. కాగా శనివారం ఉదయం ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, సీఐ యుల్లంరాజు, ఎస్‌ఐ శంకర్‌రెడ్డి ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించారు. నగదు భద్రంగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement