నర్సింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం | Application invited for Narsing Course entrance test | Sakshi
Sakshi News home page

నర్సింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 5 2013 2:55 AM | Updated on Sep 1 2017 10:26 PM

2013-14 విద్యాసంవత్సరంలో ఎంఎస్సీ(నర్సింగ్), పోస్టు బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) కోర్సుల ప్రవేశ పరీక్షకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

2013-14 విద్యాసంవత్సరంలో ఎంఎస్సీ(నర్సింగ్), పోస్టు బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) కోర్సుల ప్రవేశ పరీక్షకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మాస్టర్ ఆఫ్ ఫిజయోథెరపీ కోర్సులో ప్రవేశానికి (ఎంట్రెన్స్ లేకుండా) కూడా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ బాబూలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి 16వ తేదీ వరకూ యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను పొందవచ్చని చెప్పారు. ఎంఎస్సీ (నర్సింగ్) ప్రవేశ పరీక్ష దరఖాస్తులు  హెచ్‌టీటీపీ://పీజీఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లోను, పోస్టు బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) దరఖాస్తులు హెచ్‌టీటీపీ://యూజీఎన్‌టీ ఆర్‌యూహెచ్‌ఎస్.ఓఆర్‌జీ  వెబ్‌సైట్‌లోను అందుబాటులో ఉంటాయని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement