ఏపీ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదిక విడుదల

AP Social and Economic Survey 2019-20 Report Released - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పుష్పశ్రీవాణి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా నివేదిక రూపొందించామని ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ అన్నారు. (చదవండి : రైతుల కోసం జగన్‌ సర్కార్‌ మరో ముందడుగు)

ఏపీ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదికలోని ముఖ్యాంశాలు

ప్రస్తుత ధరల్లో 2019-20 ఏడాది 12.73 శాతం పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)

1.10 లక్షల కోట్ల రూపాయల జీఎస్‌డీపీ పెరుగుదల

స్థిర ధరల్లో 8.16 శాతం జీఎస్‌డీపీ పెరుగుదల (దేశంలో సగటున 5శాతం మాత్రమే)

స్థిర ధరల్లో జీఎస్‌డీపీ 6,72,018 కోట్ల రూపాయలు

వ్యవసాయంలో అనుకూల వాతావరణం వల్ల 18.96 శాతం పెరిగిన వ్యవసాయ రంగం గ్రాస్ వాల్యూయాడెడ్ (జీవీఏ) 

11.67 శాతం పెరిగిన ఉద్యాన శాఖ జీవీఏ

పరిశ్రమల రంగంలో స్థిర ధరల వద్ద 5.67 శాతం వృద్ధి

సేవా రంగంలో 9.11 శాతం వృద్ధి

రాష్ట్ర తలసరి ఆశయం 1.51 లక్షల నుంచి 1.69 లక్షలకు పెరుగుదల

తలసరి ఆదాయంలో 12.14 శాతం పెరుగుదల (దేశ సరాసరి తలసరి ఆదాయం 1.34 లక్షలు మాత్రమే)

రాష్ట్రంలో గత ఏడాది అక్షరాస్యత 67.35 శాతం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top