హోంగార్డుల జీతాలు పెంచిన ఏపీ ప్రభుత్వం | AP Govt Hikes Home Guards Salary | Sakshi
Sakshi News home page

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌

Oct 12 2019 8:21 PM | Updated on Oct 12 2019 8:57 PM

AP Govt Hikes Home Guards Salary - Sakshi

సాక్షి, అమరావతి : సుదీర్ఘ పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉద్యోగాల నియామకం, ఆశా వర్కర్ల జీతాల పెంపు, ట్యాక్సీ, ఆటోలు నడుపుకొనే బడుగు జీవులకు ఆర్థిక సహాయం వంటి ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా హోంగార్డులకు శుభవార్త చెప్పింది. హోంగార్డుల జీతాన్ని రూ. 18 వేల నుంచి 21,300 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ సీఎం జగన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తమకు వేతనాన్ని పెంచారంటూ రాష్ట్ర పోలీసు సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement