రుణమాఫీపై నేడే నిర్ణయం? | ap government to take a decision on loan waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై నేడే నిర్ణయం?

Sep 29 2014 10:39 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణమాఫీపై సోమవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణమాఫీపై సోమవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాయంత్రం బ్యాంకర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు. ముందుగా రైతుల బకాయిలలో కొంత మొత్తం చెల్లించడానికి బ్యాంకర్లను ఆయన అనుమతి కోరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందుబాటులో కేవలం 6వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి.

విడతల వారీగా రైతుల రుణాలకు సంబంధించిన మొత్తాలను తాము చెల్లిస్తామని, అందువల్ల చెప్పినంత మేరకు రుణాలు మాఫీ చేయాలని ఏపీ సర్కారు కోరుతోంది. అయితే బ్యాంకర్లు మాత్రం దానికి ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. నెలాఖరులోగా రుణాలు చెల్లించకపోతే 14 శాతం వడ్డీ తప్పదని ఇప్పటికే బ్యాంకు అధికారులు అల్టిమేటం జారీచేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించే బ్యాంకర్ల సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement