వైఎస్సార్‌ పెళ్లి కానుక పెంపు | AP Government Hikes YSR Pelli Kanuka Amount | Sakshi
Sakshi News home page

ఉత్తర్వులు జాఈ చేసిన ప్రభుత్వం

Sep 16 2019 2:39 PM | Updated on Sep 16 2019 3:23 PM

AP Government Hikes YSR Pelli Kanuka Amount - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివాహ సందర్భంగా పేదింటి ఆడపడుచులకు ఇచ్చే వైఎస్సార్‌ పెళ్లి కానుక మొత్తాన్ని పెంచుతూ.. సోమవారం జీఓ జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా గతంలో ఎస్సీలకు రూ. 40 వేలు ఇస్తుండగా.. తాజాగా ఈ మొత్తాన్ని రూ.లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అలానే ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలను ప్రొత్సాహిస్తూ ఇచ్చే రూ.75 వేల మొత్తాన్ని ఏకంగా రూ.1.20లక్షలకు పెంచింది. గతంలో ఎస్టీలకు ఇచ్చే రూ. 50వేల మొత్తాన్ని.. రూ.లక్షకు, బీసీలకు ఇచ్చే రూ. 35వేలను రూ.50వేలకు, మైనారిటీలకు ఇచ్చే రూ. 50వేలను లక్ష రూపాయలకు, దివ్యాంగులకు ఇచ్చే రూ.లక్షను రూ. 1.50లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలానే భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే రూ.20 వేలను లక్ష రూపాయలకు పెంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement