దూరవిద్య డిగ్రీ ఫలితాలు విడుదల | ANU Distance degree exams results released | Sakshi
Sakshi News home page

దూరవిద్య డిగ్రీ ఫలితాలు విడుదల

Mar 8 2016 6:23 PM | Updated on Aug 24 2018 2:36 PM

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల పరీక్ష ఫలితాలను మంగళవారం వైస్‌చాన్సలర్ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు.

ఏఎన్‌యూ (గుంటూరు) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల పరీక్ష ఫలితాలను మంగళవారం వైస్‌చాన్సలర్ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. ఫలితాలను www.anucde.com, www.anucde.info వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీహెచ్‌ఎం కోర్సుల నుంచి మొత్తం 15,082 మంది పరీక్షలకు హాజరుకాగా, 4,911 మంది (33 శాతం) ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యుయేషన్ ఫీజు చెల్లించడానికి మార్చి 23 ఆఖరు తేదీ.

రీవాల్యుయేషన్ ఫీజు ఒక్కో సబ్జెక్టుకు 770 రూపాయల వంతున చెల్లించాలి. రీవాల్యుయేషన్ దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ లోగా దూరవిద్య పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలి. ఫలితాల విడుదల కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్. దూరవిద్యాకేంద్రం డెరైక్టర్ ఆచార్య ఎంవీ రాంకుమార్త్న్రం, డిప్యూటీ రిజిస్ట్రార్లు బి.సత్యవతి, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement