రోడ్లు ఊడ్చిన అంగన్‌వాడీలు | anganwadi protests in streets as municipality | Sakshi
Sakshi News home page

రోడ్లు ఊడ్చిన అంగన్‌వాడీలు

Feb 22 2014 3:09 AM | Updated on Jun 2 2018 8:29 PM

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది.

 ఖలీల్‌వాడి,న్యూస్‌లైన్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం ధర్నాచౌక్ వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకురాలు నూర్జహాన్ మాట్లాడుతూ..అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

వారికి కనీస వేతనం అమలు చేయాలని,  ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్‌ఐ,పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.  కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తల,ఆయాల సంఘం, సీఐటీయూ నాయకులు ఝాన్సీ, మధు, స్వర్ణ, పుష్పలత, లలిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement