ఎన్టీఆర్‌ కన్నీళ్లు పెట్టుకున్నా మైక్‌ ఇవ్వలేదు | Alla Ramakrishna Reddy Slams Chandrababu In Assembly | Sakshi
Sakshi News home page

ఎందుకు ఆందోళన చేస్తున్నారో టీడీపీకే తెలీదు: ఆర్కే

Jan 22 2020 12:29 PM | Updated on Jan 22 2020 1:02 PM

Alla Ramakrishna Reddy Slams Chandrababu In Assembly - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వైఖరిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. సభ్యుల ప్రవర్తన గురించి రూల్స్‌బుక్‌లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల్లాగా తామెప్పుడూ ప్రవర్తించలేదన్నారు. పోడియం వద్దకు వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారో టీడీపీ సభ్యులకే అర్థం కావటం లేదని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు తీర్మానం చేస్తే తాము బలపరిచిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇక సోనియా, చంద్రబాబు కుమ్మక్కై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అయితే 23 కేసుల్లో స్టే తెచ్చుకున్న వ్యక్తిగా చంద్రబాబును పేర్కొన్నారు. ప్రజలు 151 స్థానాలు ఇచ్చి వైఎస్‌ జగన్‌కు పట్టం కట్టారని తెలిపారు. కాగా గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతకు ఎంత సమయం ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ కన్నీళ్లు పెట్టుకున్నా మైక్‌ ఇవ్వలేదని విమర్శించారు. కానీ నేడు ప్రతిపక్ష నేతలకు ఎంత అవకాశం కల్పిస్తున్నారో గమనించాలని ఆర్కే సూచించారు.

చదవండి:
నిరూపిస్తే రాజీనామా చేసి.. క్షమాపణ కోరుతా : ఆర్కే

పోలీసులపై టీడీపీ నేతల రౌడీయిజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement