నాటుసారాను పూర్తిగా నిర్మూలించాం | alcohol we should totally band | Sakshi
Sakshi News home page

నాటుసారాను పూర్తిగా నిర్మూలించాం

Oct 16 2013 3:18 AM | Updated on Sep 1 2017 11:40 PM

దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవంలో నాటుసారా అమ్మకాలను పూర్తిగా నిర్మూలించామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుర్జిత్‌సింగ్, జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రేమ్‌ప్రసాద్ అన్నారు.

ఆలూరు రూరల్, న్యూస్‌లైన్ : దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవంలో నాటుసారా అమ్మకాలను పూర్తిగా నిర్మూలించామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుర్జిత్‌సింగ్, జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రేమ్‌ప్రసాద్ అన్నారు. సోమవారం అర్ధరాత్రి వారు దేవరగట్టులో విలేకరులతో మాట్లాడారు. బన్ని ఉత్సవంలో నాటుసారా అమ్మకాలు జరగకుండా ఎక్సైజ్, ఏఆర్ సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు.
 
 అలాగే బన్ని ఉత్సవంలో పాల్గొనే నెరణికి, నెరణికితండా, కొత్తపేటతో పాటు మరో పది గ్రామాల కొండల్లో ఉన్న నాటుసారా తయారీ స్థావరాలపై దాదాపు 25 రోజులుగా సిబ్బంది దాడులు నిర్వహించారన్నారు. ఆ దాడుల్లో దాదాపు 36 వేల లీటర్ల ఊట, 1000 లీటర్లకు పైగా నాటుసారా బిందెలను ధ్వంసం చేశారన్నారు. బన్ని ఉత్సవమే గాకుండా ఆలూరు నియోజకవర్గంలో నాటుసారా స్థావరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నాటుసారా అమ్మకాలను, తయారీని అరికట్టేందుకు మున్ముందు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement