కారు,ఆటో ఢీ: ఏడుగురికి గాయాలు | 7 injured in road accident | Sakshi
Sakshi News home page

కారు,ఆటో ఢీ: ఏడుగురికి గాయాలు

Sep 12 2015 7:13 PM | Updated on Aug 30 2018 3:56 PM

మనుబోలు మండలం మడమనూరు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్నాయి.

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు (మనుబోలు) : మనుబోలు మండలం మడమనూరు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్నాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement