వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.
రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రైల్వే కోడూరు మండలం వాగేటికోన చెరువు సమీపంలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను మంగళవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారయ్యాడు. వారి నుంచి 10 ఎర్రచందనం దుంగలు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమరవాణాపై సమాచారం అందటంతో తనిఖీలు నిర్వహించినట్టు అటవీ అధికారులు తెలిపారు. కాగా పట్టుబడ్డ ఎర్రచందనం నిందితులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఏడుగురు డిగ్రీ విద్యార్థులను బైండోవర్ చేశారు.