స్కూల్ గోడను ఢీకొన్న ఆటో: విద్యార్థులకు గాయాలు | 4 students injured in wall collapse | Sakshi
Sakshi News home page

స్కూల్ గోడను ఢీకొన్న ఆటో: విద్యార్థులకు గాయాలు

Feb 29 2016 5:03 PM | Updated on Apr 3 2019 7:53 PM

స్కూల్ గోడను ఆటో ఢీకొనడంతో అది కూలి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.

భీమవరం : స్కూల్ గోడను ఆటో ఢీకొనడంతో అది కూలి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దిరుసుమర్రులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ఓ ఆటో అదుపుతప్పి దిరుసుమర్రులోని జెడ్పీ స్కూల్ గోడను ఢీకొట్టింది. దీంతో ఆర్చ్ కూలి నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement