కార్డాన్ సెర్చ్‌లో 360 మద్యం బాటిళ్లు స్వాధీనం | 360 liquor bottles seized in Cardon and search operation | Sakshi
Sakshi News home page

కార్డాన్ సెర్చ్‌లో 360 మద్యం బాటిళ్లు స్వాధీనం

Jun 28 2015 8:25 AM | Updated on Sep 3 2017 4:32 AM

కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని నవీన్‌మిట్టల్ కాలనీలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డాన్‌ సెర్చ్ నిర్వహించారు.

మచిలీపట్నం : కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని నవీన్‌మిట్టల్ కాలనీలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డాన్‌ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేశారు.

ఈ తనిఖీల్లో భాగంగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 360 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేని 11 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement