31మంది తమిళ కూలీలు అరెస్ట్ | 31 red sandalwood smugglers arrested | Sakshi
Sakshi News home page

31మంది తమిళ కూలీలు అరెస్ట్

Jan 16 2016 7:20 PM | Updated on Sep 3 2017 3:45 PM

అక్రమంగా ఎర్ర చందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న 31 మంది తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రైల్వే కోడూరు (వైఎస్సార్‌ జిల్లా) : అక్రమంగా ఎర్ర చందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న 31 మంది తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం కుప్పలదొడ్డి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి సీఐ రసూల్ సాబ్ బృందం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. రైల్వే ట్రాక్ సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న కూలీలు తారసపడ్డారు. దీంతో పోలీసులు 31 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 34 ఎర్ర చందనం దుంగలతో పాటు, ఓ కారు, ఓ లారీ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీఐ శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement