3 ట్రాక్టర్ల కంకర సీజ్ | 3 gravel tractors seized in nellore distirict | Sakshi
Sakshi News home page

3 ట్రాక్టర్ల కంకర సీజ్

Jul 11 2015 12:22 PM | Updated on Sep 3 2017 5:19 AM

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగాయకుంట నుండి అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.

బుచ్చిరెడ్డిపాళెం: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగాయకుంట నుండి అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కొడవలూరుకు చెందిన చక్కా నారయ్య, ఆయన అనుచరులు 3 ట్రాక్టర్లలో శనివారం ఉదయం గ్రావెల్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో వీఆర్‌వో మోహన్, ఎస్‌ఐ శ్రీనివాసరావు దాడిచేశారు. ఈ దాడిలో 3  ట్రాక్టర్లతో పాటు ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. గ్రావెల్ తరలిస్తున్న వ్యక్తులు పరారయ్యారు. వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement