22 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ | 22 gamblers arrested in krishna district | Sakshi
Sakshi News home page

22 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

Nov 7 2014 9:13 AM | Updated on Aug 20 2018 4:44 PM

కృష్ణాజిల్లాలోని పలు పేకాట స్థావరాలపై పోలీసులు గురువారం అర్థరాత్రి ముమ్మర దాడులు నిర్వహించారు.

విజయవాడ: కృష్ణాజిల్లాలోని పలు పేకాట స్థావరాలపై పోలీసులు గురువారం అర్థరాత్రి ముమ్మర దాడులు నిర్వహించారు. ఆగిరిపల్లి మండలం శోభనాపురంలోని పేకట స్థావరాలపై దాడి చేసి... 12 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 15 వేల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం పేకేటారాయుళ్లను అగిరిపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు. అలాగే చాట్రయి మండలం మంకొల్లు వద్ద కూడా పోలీసులు పలు పేకాట స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడులలో మొత్తం 10 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 వేల నగదు స్వాధీనం చేసుకుని... చాట్రయి పోలీసు స్టేషన్కు తరలించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement