బస్సు ఢీకొని 15 మందికి గాయాలు | 15 injured in road accident | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని 15 మందికి గాయాలు

Apr 8 2015 5:08 PM | Updated on Jun 1 2018 8:54 PM

అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిటికొండ గ్రామం వద్ద బస్సు అదుపుతప్పి బస్సు షెల్టర్ లోకి దూసుకుపోవడంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిటికొండ గ్రామం వద్ద బస్సు అదుపుతప్పి బస్సు షెల్టర్ లోకి దూసుకుపోవడంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. గుత్తి నుంచి డోన్ వైపు వెళుతున్న డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టైరు పంక్చర్ అవడంతో పక్కనున్న బస్ షెల్టర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు స్టాప్ లో ఉన్న 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(గుత్తి)

Advertisement
 
Advertisement
Advertisement