అగ్ని ప్రమాదం: 12 గుడిసెలు దగ్ధం | 12 thatcted houses burn in fire accident | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదం: 12 గుడిసెలు దగ్ధం

Apr 13 2015 7:42 AM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పంటుకొని గుడిసెలు దగ్ధమయ్యాయి.

కృష్ణా : ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పంటుకొని గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన సోమవారం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండల కేంద్రంలోని పూలరాజుకాలువగట్టు దగ్గర జరిగింది. వివరాలు..మండల కేంద్రంలోని పూలరాజు కాలువగట్టు(హైజాక్ కాంపౌండ్‌)లో వలస కార్మికులు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం పక్కనున్న గడ్డివాముకు నిప్పంటుకొని మంటలు వ్యాపించడంతో 12 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో దాదాపు 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెవిన్యూ అధికారులు ఈ ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement