కర్నూలు జిల్లా పెద్దకబుదూరు మండలం రాజీమాన్‌దొడ్డి గ్రామంలో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పెద్దకబుదూరు : కర్నూలు జిల్లా పెద్దకబుదూరు మండలం రాజీమాన్‌దొడ్డి గ్రామంలో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం ఆర్‌ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని 100 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. కుంభరి లక్ష్మన్న, లెండి వెంకన్న, వెంకటేశ్‌పై కేసు నమోదు చేశారు.