breaking news
-
మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా?: వైఎస్ జగన్
ఈ రోజు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ శాఖలో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తాం. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్‌బుక్ కారణంగా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి, ఒకటే చెబుతున్నా. ఈ అన్యాయాల్లో మీరు భాగస్వాములు కావొద్దు. మీరు వాటిలో భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు మిమ్మల్ని కూడా కచ్చితంగా బోను ఎక్కించే కార్యక్రమం చేస్తానని హెచ్చరిస్తున్నా. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఏమయ్యా చంద్రబాబూ.. కమ్మవారు మా పార్టీలో ఉంటే నీకు అభ్యంతరమా? కమ్మవారు పుట్టింది కేవలం మీకు ఊడిగం చేయడానికేనా? చంద్రబాబు అన్యాయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే, ప్రశ్నిస్తే.. వారిని వెంటాడి వెంటాడి, హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం.. పచ్చ మీడియా ద్వారా ట్రోలింగ్ చేయడం.. చివరకు వారంతట వారు ప్రాణాలు తీసుకునేలా అవమానించడం. ఇలా చేయడం కేవలం చంద్రబాబుకు మాత్రమే చెల్లు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు? ఏం పాపం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసుకునేలా లక్ష్మీనారాయణను ప్రేరేపించారు? ఏం పాపం చేశారని మా పార్టీలో ఉన్న కమ్మ వారిపై తప్పుడు కేసులు పెట్టారు?సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, సంక్షేమాభివృద్ధి అన్నది పక్కకుపోయి రెడ్‌బుక్ రాజ్యాంగం ద్వారా కక్ష సాధింపు మాత్రమే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. పోలింగ్ రోజు నుంచే రెడ్‌బుక్ రూల్ అమలవుతోందని చెప్పడానికి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యే నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీలో కమ్మ కులస్తులు ఉండటం తప్పా? ఏం పాపం చేశారని వైఎస్సార్సీపీలోని కమ్మ నేతలను వేధిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. కమ్మవాళ్లు పుట్టింది మీకు ఊడిగం చేయడానికా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదని, ఇప్పుడు తప్పు చేస్తున్న అధికారులందరికీ తమ ప్రభుత్వం వచ్చాక సినిమా చూపిస్తామని స్పష్టంచేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరింపులునా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు అన్న (కొర్లకుంట వెంకటేశ్వరరావు) సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మా పార్టీ నాయకుడు. ఈయన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్‌కు ముందు టీడీపీ నేతలు వారికి అనుకూలమైన అధికారులందరికీ పోస్టింగులు ఇప్పించుకున్నారు. పోలింగ్ సమయంలో ఈ ప్రాంత ఐజీ, ఎస్పీ, సీఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేశారన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్నది ఈ గ్రామంలో కనిపిస్తుంది. 2024 జూన్ 4న అంటే కౌంటింగ్ రోజున.. అల్లర్లు చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడంతో నాగమల్లేశ్వరరావును పోలీసులు స్టేషన్‌కు తీసుకుపోయి సెల్లో వేశారు. ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడం మొదలు కాగానే, నాగమల్లేశ్వరరావు ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. అక్కడ పోలీస్ స్టేషన్లో నాగమల్లేశ్వరరావును సీఐ రాజేష్ తీవ్రంగా బెదిరించారు. ఊళ్లోకి పోవద్దని, ఊరు విడిచి పెట్టాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్‌న్ చేయడమే కాకుండా, కాల్చి చంపుతామని హెచ్చరించాడు. జూన్ 4న కౌంటింగ్ పూర్తయినా, మర్నాడు 5వ తేదీ సాయంత్రం వరకు నాగమల్లేశ్వరరావును స్టేషన్లోనే ఉంచి అవమానించి, బెదిరించారు. చేయని నేరాలన్నీ మోపారు. ఆ రోజు రాత్రి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తన తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్‌చేసి, స్టేషన్లో పోలీసుల బెదిరింపులు, అవమానించిన తీరుతో పాటు, ఏ రకంగా కొట్టి హింసించారనేది చెప్పి, విలపించి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. దీంతో హుటాహుటిన గుంటూరు వెళ్లిన వెంకటేశ్వర్లు, కొడుకు నాగమల్లేశ్వరరావును ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ జూన్ 9న చనిపోయాడు.దీనికి బాధ్యులెవరు?నాగమల్లేశ్వరరావుకు భార్య, చిన్న పాప ఉన్నారు. వారికి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును అడుగుతున్నా. మీ పార్టీకి అనుకూలంగా లేరన్న ఒకే ఒక్క కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణం అయ్యారు. ఏడాది గడిచింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళ్టికి కూడా శోకంలోనే ఉంది. మరి దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేసిన వారిలో ఎంత మందిని అరెస్టు చేశారు? ఎంత మంది మీద కేసులు పెట్టారు? ఎంత మందికి శిక్ష విధించారు? అని అడుగుతున్నా. ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని చంద్రబాబును నిలదీస్తున్నా. ఇక్కడ యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. చివరికి వెంకటేశ్వర్లు అన్న కోర్టు ద్వారా ప్రైవేటు కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు.చావు బతుకుల్లో గుత్తా లక్ష్మీనారాయణ ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. రెండు నెలల క్రితం ఆయనపై తప్పుడు అభియోగాలు మోపి స్టేషన్‌కు పిలిచిన సీఐ, ఎస్ఐలు ఇద్దరూ భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే వాటన్నింటికీ ఆయన గట్టిగా సమాధానం ఇవ్వడం, తమ అభియోగాలకు ఏ ఆధారం లేకపోవడంతో లక్ష్మీనారాయణను విడిచి పెట్టారు. మళ్లీ రెండు నెలల తర్వాత డీఎస్పీ హనుమంతరావు ఆయన్ను స్టేషన్‌కు పిలిపించి బెదిరించారు. ఆ డీఎస్పీ ఒక కుల ఉన్మాది. ‘అసలు మీరు పోలీసు బట్టలు వేసుకున్నారా? న్యాయం, ధర్మం కోసం నిలబడి ఉన్నారా? లేక న్యాయం, ధర్మాన్ని చంపేయడం కోసం ఉన్నారా?’ అని నేను ఆ డీఎస్పీని అడుగుతున్నా. లక్ష్మీనారాయణను స్టేషన్‌కు పిలిచిన డీఎస్పీ హనుమంతరావు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. ‘కమ్మ కులంలో పుట్టి వైఎస్సార్సీపీలో ఎలా ఉన్నావ్? ఎందుకు ఉన్నావ్?’ అంటూ కించపరుస్తూ మాట్లాడాడు. తప్పుడు సాక్ష్యాలతో జైలుకు పంపుతానని కూడా బెదిరించి, లెంపకాయలు వేసి కొట్టి అవమానించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నిస్తూ.. అన్ని వివరాలు చెబుతూ సెల్ఫీ వీడియో తీశారు. ఎలాంటి పరిస్థితుల మధ్య తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాననేది పూర్తిగా వివరించారు. పోలీసు శాఖలో కొందరు ఏ రకమైన కుల ఉన్మాదంతో పని చేస్తున్నారో.. వారిని చంద్రబాబు, లోకేశ్ లాంటి వ్యక్తులు ఎలా నడిపిస్తున్నారనేది సూసైడ్ అటెంప్ట్ వీడియోలో స్పష్టంగా చెప్పారు.సత్తెనపల్లిలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం అసలు వారంతా ఏం పాపం చేశారు?⇒ మా పార్టీలో ఉన్నారనే ఏకైక కారణంతో కమ్మ వారిని వేధిస్తారా? ఏం పాపం చేశారని ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మా పార్టీ నాయకుడు వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు? ఒక కేసులో బెయిల్ వస్తే.. వెంటనే ఇంకో కేసు పెడతారు.. మళ్లీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాల్టికి దాదాపు రెండు నెలలు దాటి పోయింది. వంశీ ఇంకా చంద్రబాబు శాడిజానికి బలవుతూ జైలులోనే మగ్గుతున్నాడు. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీ మాజీ మంత్రి కొడాలి నానిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు? దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసులు మీద కేసులు పెడతున్నారు. ఇప్పటికే ఆయనపై తొమ్మిది కేసులు పెట్టారు. ఏం పాపం చేశారని దేవినేని అవినాష్‌ను వేధిస్తున్నారు? కేవలం కమ్మ సామాజికవర్గంలో పుట్టాడనా? అవినాష్, చంద్రబాబును వ్యతిరేకిస్తున్నాడు. చంద్రబాబుకు ఊడిగం చేయడం ఇష్టం లేదన్నాడు. ఆ ఒక్క కారణంతో అవినాష్‌పై కూడా కేసులు మీద కేసులు పెట్టి రోజూ హింసించే కార్యక్రమం చేస్తున్నారు. రోజూ కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకుని చంద్రబాబుతో యుద్ధం చేస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంపై మూడు కేసులు పెట్టారు? రఘురాం నాతో 15 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు? ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రాష్ట్రంలో వ్యాపారాలు చేసే పరిస్థితి లేకుండా వెళ్లగొట్టేశారు. తనను కూడా బెదిరించి, తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు కేసులు బనాయించి ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ⇒ మా పార్టీకి చెందిన వినుకొండ, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావుల మీద ఎందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు? తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీద అక్రమ కేసులు ఎందుకు పెట్టారు. ఆయన కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోగా కాలేజీలో తనిఖీల పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు.⇒ మా పార్టీ సానుభూతిపరుడైనందుకు ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన సినీ నటుడు, దర్శకుడు, డైలాగు రైటర్ పోసాని కృష్ణమురళిని నెల రోజులపాటు జైళ్లలో నిర్బంధించి వేధించారు. అక్రమంగా 9 కేసులు బనాయించి శ్రీకాకుళం నుంచి కడప దాకా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ ఏం పాపం చేశాడని ఆయనకు వైజాగ్‌లో స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన భూములు రద్దు చేశారు?⇒ మంగళగిరికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు ఆయనతో పాటు, ఆయన భార్య పాలేటి కృష్ణవేణి మీద ఏకంగా 11 కేసులు పెట్టి నెల రోజులపాటు జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్‌కుమార్‌ను దారుణంగా కొట్టి, చొక్కా విప్పించి లోకేశ్ ఫొటో ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి, దండం పెట్టించి ప్రాధేయపడేలా చేశారు. ఏం పాపం చేశాడని సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ మీద 19 తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు?మీ తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం⇒ ఏమయ్యా చంద్రబాబూ.. నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5. ఒక దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్నది పంచుకోవడం. ఇదీ, మీరంతా చేస్తున్న పని. మీరు దోచుకోవడానికి చంద్రబాబు సీఎంగా ఉండటం అవసరం. మీరంతా గజ దొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటుంటే మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మవాడైనా ప్రశ్నిస్తే చాలు.. వారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి ఏ మాత్రం వెనుకాడని మీ నైజం చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా అనిపిస్తోంది.⇒ చంద్రబాబును ప్రశ్నిస్తే కమ్మ కులంలో తప్పు పుట్టినట్టుగా వారి మీద కక్ష కట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. చంద్రబాబును వెనకేసుకొస్తున్న ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా మొత్తం కలిసి చంద్రబాబును వెనకేసుకొస్తూ.. ఆయన్ను వ్యతిరేకించిన వారి మీద బురద జల్లుతూ అప్రతిష్టపాలు చేస్తున్న తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం కాదా?⇒ సీఐ రాజేష్ మీద నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు ప్రైవేటు కేసు వేస్తే, కోర్టు ఆదేశించినా పోలీసులు కేసు కట్టలేదు. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్‌బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? చంద్రబాబు పాలనలో రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అక్కచెల్లెమ్మలు.. ఇలా ఎవ్వరూ సంతోషంగా లేరు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకు అన్ని వర్గాలు బలైపోయాయి. రెడ్‌బుక్ రాజ్యాంగం, విచ్చలవిడి అవినీతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనం అయ్యాయి. అందుకే ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు. దేవుడు, ప్రజలు గట్టిగా మొట్టికాయలు వేసే రోజు తొందర్లోనే వస్తుంది. -
నిజం దాచి ఎల్లో మీడియా విష ప్రచారం.. అసలు జరిగింది ఇదే..
సాక్షి, పల్నాడు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఎల్లో మీడియా విషం కక్కుతోంది. ప్రజాదరణ చూసి ఓర్వలేక పచ్చి అబద్దాలను పచ్చ కూటమి వల్లె వేస్తోంది. సత్తెనపల్లిలో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందినట్టు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోంది. ఎల్లో మీడియా విష ప్రచారం చూసి జనం అవాక్కవుతున్నారు.నిజానికి జయవర్ధన్ రెడ్డి అస్వస్థతతో మృతి చెందారు. ర్యాలీ పాల్గొన్న సమయంలో ఆయన అలసటకు గురయ్యారు. అలసటతో ఒక షాపు ఎదుటకు వెళ్లి కూర్చున్న సీసీ కెమెరా విజువల్స్ లభ్యమయ్యాయి. కొద్దిసేపటి తర్వాత వెళ్లేందుకు లేచిన జయవర్ధన్ కుప్పకూలారు. వెంటనే స్థానికులు బైకు మీద ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయవర్ధన్ మృతి చెందారు. దీనిపై కూడా ఎల్లో బ్యాచ్ విష ప్రచారం చేస్తోంది. -
ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించాలని చూస్తున్నారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: విజయవాడ కోర్టులో అక్రమ లిక్కర్ కేసుపై వాదనలు ముగిశాయి. న్యాయవాదితో పాటు స్వయంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండానే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.2024 ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట చిల్లకల్లు టోల్ గేట్ వద్ద 8.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు.. ఆ డబ్బును ఇప్పుడు లిక్కర్ డబ్బుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిల్లకల్లు టోల్ గేట్ వద్ద పట్టుకున్న డబ్బు తనదేనని అప్పట్లో ప్రద్యుమ్న అనే వ్యక్తి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ డబ్బు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించొద్దని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలున్నా లిక్కర్ కేసులో ప్రస్తావించారు. డబ్బులు తరలించామని గన్ మెన్ గిరి ఒప్పుకున్నాడు. అలాంటపుడు అతనే ప్రధాన ముద్దాయి.ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఇలా డబ్బులు తరలించినందుకు గిరి నేరం చేసినట్లే కదా. ఇటీవల గిరికి ఆక్టోపస్‌లో ప్రమోషన్ ఇచ్చి రూ. 60 వేలు ఎలా పెంచారు. డబ్బులు తరలించిన వ్యక్తి ముద్దాయి అవుతారు కానీ సాక్షి ఎలా అవుతారు?. అతని సాక్ష్యం ఎలా చెల్లుతుంది. మదన్ అనే గన్ మెన్‌ను సిట్ అధికారులు కొడితే మణిపాల్‌లో చేరాడు. సిట్ అధికారులు భయబ్రాంతులకు గురుచేశారని డీజీపీకి లేఖ రాశాడు. గిరి చెప్పినది వాస్తవమా?. మదన్ చెప్పింది వాస్తవమా?చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడు ఇరికించారు. చౌదరి సామాజికవర్గానికి చెందిన వాడివి అయ్యుండి చౌదరి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవా అని సిట్ అధికారులు బెదిరించారు. రెండు సార్లు వెంకటేష్ నాయుడిని సిట్ విచారించింది. అబద్ధపు సాక్ష్యం చెప్పమని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా వెంకటేష్ నాయుడు అంగీకరించలేదు. ఈ కేసులో అంతా కట్ అండ్ పేస్ట్ తప్పుల తడకగా ఉంది. వెంకటేష్ నాయుడు వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. కానీ వెంకటేష్ నాయుడిని కేసులో ఐఏఎస్‌గా చూపించారు’ అని చెవిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. -
కమ్మవాళ్లు మా పార్టీలో ఉంటే నీకేంటి?: చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, పల్నాడు: ఏపీలో కొందరు పోలీసులు కుల ఉన్మాదంతో పనిచేస్తున్నారని.. కమ్మవాళ్లు కేవలం చంద్రబాబుకి ఊడిగం చేయడానికే పుట్టారా? అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఇక్కడి డీఎస్పీ హనుమంతరావు కుల ఉన్మాది. కమ్మ పుట్టుక ఎందుకు పుట్టావంటూ లక్ష్మీనారాయణ అనే కార్యకర్తను ఆయన అవమానించారు. అది భరించలేక సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఎం, ఆయన కుమారుడు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో ఆ వీడియోలో చెప్పాడు. లక్ష్మీనారాయణ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చంద్రబాబూ.. మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా?. వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు నాగమల్లేశ్వరరావు, గుత్తా లక్ష్మీనారాయణ.. ఈ ముగ్గురి విషయంలో.. నేను చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. మా పార్టీలో కమ్మ వాళ్లు ఉండొద్దా? మీ పార్టీ కేవలం వారికేనా? అని వైఎస్ జగన్ నిలదీశారు.ఏం పాపం చేశారని.. వైఎస్సార్సీపీలోని కమ్మ సామాజిక వర్గ నేతలను చంద్రబాబు టార్గెట్ చేసి వేధిస్తున్నారు. చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే, వెంటాడి వెంటాడి వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. జైలుకు పంపిస్తున్నారు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును పొట్టన పెట్టుకున్నాడు. ఏం పాపం చేశాడని లక్ష్మీనారాయణ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా చేశారు. చంద్రబాబుకి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేడనే దేవినేని అవినాష్‌ను వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని వల్లభనేని వంశీని జైల్లో పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు శాడిజానికి వల్లభనేని వంశీ బాధపడుతున్నాడు. కొడాలి నాని ఏం పాపం చేశాడని కేసు పెట్టారు. ఏంపాపం చేశాడని.. మా పార్టీ నేత తలశిల రఘురాంపై 3 కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని అబ్బయ్య చౌదరిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని దగ్గుబాటి సురేష్ వైజాగ్ ల్యాండ్ క్యాన్సిల్ చేశారు. ఏం పాపం చేశాడని నంబూరు శంక్రరావును వేధిస్తున్నారు. నా పక్కనే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయననూ వేధిస్తున్నారు. ఏం పాపం చేసిందని.. మంగళగిరికి చెందిన రాజ్‌కుమార్-కృష్ణవేణిలను వేధించారు. రాజ్‌కుమార్‌ను మోకాళ్ల మీద రోడ్డు మీద కూర్చోబెట్టారు. మహిళ అని చూడకుండా కృష్ణవేణిని వేధించారు. ఏం పాపం చేశాడని.. ఇంటూరి రవిపై 19 కేసులు పెట్టి వేధించారు. ఏం పాపం చేశాడని.. ఏం పాపం చేశాడని.. బ్రహ్మనాయుడిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని.. పోసానిపై 9 కేసులు పెట్టి వేధించారు. చంద్రబాబును ఎవరైనా కమ్మ వారు వ్యతిరేకిస్తే, వీరు ప్రవర్తిస్తున్న తీరు రాక్షసులకన్నా దారుణం.సినిమా చూపిస్తాంవైఎస్సార్సీపీ కమ్మ నేతలను వేధించే కుట్రలో ఎల్లో మీడియా మీడియా భాగమైంది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఒక ముఠా. రాష్ట్రాన్ని దోచుకోవడం. అదే మీ పని. గజదొంగలుగా దోచుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారిని అణిచి వేస్తున్నారు. పోలీసులూ.. చంద్రబాబు పాపంలో భాగం కావొద్దు.ఒక విషయం గుర్తుంచుకొండి. కొందరు పోలీసు అధికారులకు చెబుతున్నాను. చంద్రబాబు ఎల్లకాలం ఉండడు. ఇప్పటికే ఏడాది గడిచింది. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. అప్సుడు మీకు సినిమా చూపిస్తాం. ఇప్పుడు తప్పు చేస్తున్న వారందరినీ బోను ఎక్కిస్తాం. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. అందరూ మోసపోయారు. వెన్నుపోటుకు గురయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు. ఇది ఎల్లకాలం సాగదు. ప్రజలు, దేవుడు తప్పకుండా మొట్టికాయలు వేస్తారు’’ అని వైఎస్ జగన్ రెంటపాళ్ల వేదికగా వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబూ.. నాగమల్లేశ్వరరావు భార్యా, కూతురికి ఏం చెబుతారు?: వైఎస్ జగన్
సాక్షి, పల్నాడు: రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అనడానికి కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన ఆయన.. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు ఘటనను ప్రస్తావించారు. అంతకు ముందు.. నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలో అభివృద్ధి, సంక్షేమం ఏదీ లేదు. కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోంది. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఆంక్షలే నిదర్శనం. తమకు అనుకూలమైన పోలీసులను ఎన్నికల ఫలితాల వేళ నియమించుకున్నారు. కూటమిని గెలిపించుకునేందుకు అన్యాయాలు చేశారు. ఈ విషయం ఈ ప్రాంతం వారందరికీ తెలుసు. నాగమల్లేశ్వరరావు రెంటపాళ్ల ఉపసర్పంచ్. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున టీడీపీ, జనసేన నేతల తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పీఎస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఘోరంగా అవమానించారు. టీడీపీకి అనుకూల ఫలితలు రావడంతో నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. ఊరు విడిచిపోవాలని ఆయన్ని వేధించారు. లేకుంటే రౌడీ షీట్ తెరుస్తామని సీఐ ఏకంగా బెదిరించారు. జూన్ ఐదో తేదీ రాత్రి పోలీసులు నాగమల్లేశ్వరరావును విడిచిపెట్టారు. ఆయన సరాసరి గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్ చేసి పోలీసులు బెదిరించిన తీరును నాగమల్లేశ్వరరావు వివరించారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరావు ఆత్మహత్యయత్నం చేశారు. తనకొడుకును కాపాడుకునేందుకు వెంకటేశ్వర్లు తీవ్రంగా యత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నాగమల్లేశ్వరరావును బెదిరించిన ఆ సీఐపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?. నాగమల్లేశ్వరరావుకు భార్యా, కూతురు ఉన్నారు. చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నియోజక వర్గంలో లక్ష్మీనారాయణ అనే పార్టీ కార్యకర్తపైనా పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని, అది భరించలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని జగన్ ప్రస్తావించారు. -
జనం గుండె ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వనిస్తోంది : రోజా
సాక్షి,గుంటూరు: వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల చేరుకున్నారు. రెంటపాళ్లలో కూటమి నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం, నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన వేళ కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకుల్ని సృష్టించింది. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది. భారీ కేడ్లు, చెక్ పోస్టులతో వైఎస్ జగన్ అభిమానుల్ని, వైఎస్సార్సీపీ శ్రేణుల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ వైఎస్ జగన్‌పై తమకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని అభిమానులు, శ్రేణులు నిరూపించారు.తమ అభిమాన నాయకుడు రెంటపాళ్లకు వస్తున్నారనే సమాచారంతో సత్తెనపల్లితో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ అభిమానులు,పార్టీ శ్రేణులు రెంటపాళ్లవైపు కదిలారు. జనప్రభంజనంలా తరలివచ్చారు. వెల్లువలా వచ్చిన ప్రజలతో సత్తెనపల్లి నియోజకవర్గం జనసంద్రంలా మారింది. ప్రభుత్వం ఆంక్షలు సైతం వైఎస్ జగన్‌పై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి. ఈ క్రమంలో వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనపై అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదికగా స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని అనుకున్నారు. అభిమానులను ఆపాలని చూశారు. అడ్డుకట్ట వేయాలని యత్నించారు. షరతులు విధించారు.. ఆంక్షలు పెట్టారు.. బెదిరింపులకు దిగారు.. నోటీసులు ఇచ్చారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ వైఎస్ జగన్ అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన తరంగాలను ఆపలేకపోయారు.“రోడ్లు మూసేశారా? మాకేం!”“పోలీసులు అడ్డుపడుతున్నారా? మాకేం!”మన గుండెల్లో ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వని మారుతోంది.మన నరాల్లో ప్రవహించే రక్తం, జననేతను ఒక్కసారి చూడాలనే తపనతో ఉప్పొంగుతోంది.అందుకే..పొలాల గట్లే రోడ్లయ్యాయి,పొలాల బాటలే ఎర్ర తివాచీలయ్యాయి,ముళ్ల దారులే హైవేలయ్యాయి.అభిమానులు పోటెత్తారు!“తగ్గేదేలే!” అంటూజగన్ను ఒక్క చూపైనా చూడాలన్న ఆశతోఇలా బయలుదేరారు… వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని అనుకున్నారు. అభిమానులను ఆపాలని చూశారు. అడ్డుకట్ట వేయాలని యత్నించారు. షరతులు విధించారు.. ఆంక్షలు పెట్టారు.. బెదిరింపులకు దిగారు.. నోటీసులు ఇచ్చారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ @ysjagan అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన… pic.twitter.com/StMxCxf2az— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025 -
నోటీసు ఇవ్వకుండానే నన్ను అరెస్ట్ చేశారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: పోలీసులు తీరుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిస్ ఇవ్వకుండానే తనను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. నిన్న(మంగళవారం) ఆయన రాసిన లేఖ వైరల్‌గా మారింది.‘‘నిన్నటి వరకు నాపై ఎఫ్ఐఆర్ కూడా లేదు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పా. లుకౌట్ నోటీసులు ఎందుకిచ్చారో తెలియదు. విచారణలో కనీసం నా అభిప్రాయం కూడా తీసుకోలేదు. తప్పుడు కేసులను ఎదుర్కొంటా’’ అని చెవిరెడ్డి పేర్కొన్నారు.కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మా అన్నపై మొదట హత్య కేసు పెట్టారు. మా నాన్నపై ఫాక్సో కేసు పెట్టారు. కేసుల పేరుతో లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు’’ అని హర్షిత్‌రెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం...మా వ్యాపార పనుల రీత్యా విదేశాలకు వెళ్తుంటే పారిపోతున్నామని ప్రచారం చేస్తున్నారు. మా పై పెట్టిన అక్రమ కేసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మా అన్నపై కేసు పెట్టారు.. మా నాన్నపై కేసు పెట్టారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం. మాపై కేసులు పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం’’ అని హర్షిత్‌రెడ్డి చెప్పారు.కాగా.. నిబద్ధత, నిజాయితీ, పారదర్వకత అంటూ లేఖ రాసిన సిట్ అధికారులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి లేఖ ద్వారా ప్రశ్నించారు. ఒక్క ఏడాది కాలంగా విచారణ చేస్తున్న సిట్ అధికారులు.. ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి రాజ్ కసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని కానీ ప్రజలకు పంచారని కానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థమేంటి?. అది నిజం కాదు కనకే కదా? అంటూ ఆయన ప్రశ్నించారు. -
నాగమల్లేశ్వరరావు మృతి: నాడు జరిగింది ఇదే..
సాక్షి, పల్నాడు: సత్యం ఊపందుకోకముందే ఒక అబద్ధం ప్రపంచవ్యాప్తంగా సగం దూరం ప్రయాణించగలదు. అలాంటి ప్రచారాలు ఎల్లో బ్యాచ్‌కు వెన్నతో పెట్టిన విద్య. మీడియా సంస్థలను, సోషల్ మీడియాను మేనేజ్ చేయగలిగే వాళ్లు.. ఇప్పుడు జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంతోనూ తప్పుడు రాతలు, ప్రచారాలతో చెలరేగిపోతున్నారు. ఏడాది కిందట.. పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో నాగమల్లేశ్వరరావు అనే వైఎస్సార్సీపీ నేత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. బాధితుడి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వైఎస్ జగన్ పల్నాడు పర్యటనకు సిద్ధమయ్యారు. అంతే.. పచ్చదండు విషపు రాతలతో రెచ్చిపోసాగింది. బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడంటూ సైకో ప్రచారం కొనసాగించింది. ఇది రెంటపాళ్ల గ్రామస్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు ఆనాడు ఏ జరిగిందంటే.. 2024 జూన్ 4న.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నాగమల్లేశ్వరరావు ఇంటిపై కూటమి నేతలు దాడి చేశారు. ఆ కాసేపటికే ఆయన్ని స్థానిక పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలా.. జూన్ 5 రాత్రి 10గంటల వరకు పోలీసులు నిర్భంధించారు. అయితే స్టేషన్లో ఏం జరిగిందంటే.. ‘‘మన ఇంటిపై దాడి చేస్తున్నారు నాన్నా’’ అంటూ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాగమల్లేశ్వరరావుకు ఆయన కుమార్తె ఫోన్ చేశారు. కుమార్తెతో మాట్లాడుతుండగా ఫోన్ లాక్కుని.. నాగమల్లేశ్వరరావును పోలీసులు దుర్భాషలాడారు. గ్రామంలోకి వెళ్ల కూడదని బెదిరించారు. ఒకవేళ తమను కాదని గ్రామంలోకి వెళ్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. గ్రామంలో ఉండకూడదు’’ అని నాగమల్లేశ్వరరావును పోలీసులు భయపెట్టారు. గ్రామంలో ఉంటే కాల్చేస్తామని బెదిరింపులకు దిగారు. ఆపై జైలు నుంచి బయటకు వచ్చిన నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. తనను పోలీస్ స్టేషన్లో తీవ్రంగా అవమానించి.. కొట్టారంటూ తండ్రికి ఫోన్ చేసి వాపోయారు. ఇలా రెడ్‌బుక్ పాలనలో భాగంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు బలైన వైఎస్సార్సీపీ తొలి కార్యకర్త నాగమల్లేశ్వరరావు కావడం గమనార్హం. ఇటీవలే ఆయన సంవత్సరీకం పూర్తయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ రెంటపాళ్ల గ్రామాన్ని వెళ్లారు. మరోవైపు.. ఈ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగంతో అన్నివిధాల ప్రయత్నించిన కూటమి ప్రభుత్వం.. చివరకు ఇలా ‘బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడంటూ’’ ఐటీడీపీ అండ్ కో ద్వారా విషప్రచారానికి దిగజారిపోయింది. -
అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం: చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా అన్నపై మొదట హత్య కేసు పెట్టారు. మా నాన్నపై ఫాక్సో కేసు పెట్టారు. కేసుల పేరుతో లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు’’ అని హర్షిత్‌రెడ్డి పేర్కొన్నారు.లిక్కర్ వల్ల మా కుటుంబం మొత్తం నాశనమైంది. మేము లిక్కర్ ఎప్పుడూ పంచ లేదు, విక్రయించలేదు. మాపై తప్పుడు కేసులు పెట్టారు. న్యాయస్థానంలో తేల్చుకుంటాం. మా గన్ మ్యాన్, పీఏ, మా సిబ్బందినీ కూడా బెదిరిస్తున్నారు. లిక్కర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం.మా వ్యాపార పనుల రీత్యా విదేశాలకు వెళ్తుంటే పారిపోతున్నామని ప్రచారం చేస్తున్నారు. మా పై పెట్టిన అక్రమ కేసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మా అన్నపై కేసు పెట్టారు.. మా నాన్నపై కేసు పెట్టారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం. మాపై కేసులు పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం’’ అని హర్షిత్‌రెడ్డి చెప్పారు. -
ప్రశ్నిస్తానన్న పవన్.. ఏమైపోయావ్?: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలు మోసపోయారని.. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగిన ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ నిలదీశారు. బుధవారం ఆయన ‘‘జగన్ అంటే నమ్మకం-చంద్రబాబు అంటే మోసం’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘చంద్రబాబు 1 లక్ష 50 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తమ యంత్రాంగానికి దోచిపెడుతున్నారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న లోకేష్ ఆ హామీ మరిచిపోయారా?. తల్లికి వందనం పథకంపై కూటమి నాయకులు డబ్బులు కోరుకుంటున్నారు. ఏడాది కూటమి పాలనలో స్త్రీ శక్తి పథకం డబ్బులు ఎవరికీ వేశారు?. రాష్ట్ర మహిళలు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారా?. ఏ ఆగస్ట్‌లో ఈ ఉచిత బస్సు అమలు చేస్తారు?’’ అంటూ కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.‘‘కూటమి పాలనలో వ్యవసాయ రంగంలో పూర్తిగా దెబ్బతింది. ప్రజలు ప్రభుత్వన్ని నిలదీస్తారని రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో డీబీటీ ద్వారా నేరుగా ప్రజల అకౌంట్లో డబ్బులు జమ చేసేవాళ్లం. పోలవరం ప్రాజెక్టు సృష్టికర్త వైఎస్సార్‌పై కూడా విమర్శలు చేస్తున్నారు. 1 లక్ష 50 వేల కోట్లలో పోలవరానికి ఎంత కేటాయించారు?. మైనింగ్ కార్పొరేషన్లో గనులకు వచ్చే లక్షల కోట్ల రూపాయల మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్తున్నాయి’’ అని కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పిఠాపురంలో జనసేన కార్యకర్త అన్యాయన్నీ ప్రశ్నించాడని ఊరు నుంచి వెలివేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేస్తే వీడియో కాల్లో పరామర్శిస్తారా?’’ అంటూ కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. -
బాబూ.. ప్రజాదరణ ఉన్న జగనన్నను అడ్డుకుంటారా?: రోజా
సాక్షి, నగరి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. టీడీపీ కార్యర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించలేదా చంద్రబాబు అని ప్రశ్నించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘కూటమి ప్రభుత్వ వేధింపులు భరించలేక వైఎస్సార్సీపీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ గారు పరామర్శించడానికి వెళ్లడం తప్పా?. చంద్రబాబు గారూ.. మీ పార్టీ కార్యర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించలేదా?. ఆంక్షలు పెట్టి ప్రజాదరణ కలిగిన నాయకుడిని అడ్డుకోవాలని చూడటం ఏ మాత్రం కరెక్టు కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మీ ప్రభుత్వ వేధింపులు భరించలేక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన కుటుంబాన్ని వైయస్ జగన్ గారు పరామర్శించడానికి వెళ్లడం తప్పా @ncbn గారూ? మీ పార్టీ కార్యర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామ…— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025 -
చెవిరెడ్డి అక్రమ అరెస్ట్.. తిరుపతిలో నిరసనలు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుపై పార్టీ కార్కకర్తలు కదం తొక్కారు. కూటమి అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలని, అక్రమ అరెస్టులు నుంచి నాయకులను కాపాడాలని అంబేద్కర్‌కు పార్టీ కార్యకర్తలు వినతిపత్రం సమర్పించారు. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. కూటమికి అంతిమ ఘడియలు ప్రారంభమైనట్టు హెచ్చరించారు.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుపై తిరుపతిలో ఆగ్రహజ్వాలు వ్యక్తమవుతున్నాయి. భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఏపీని రక్షించాలని, అక్రమ అరెస్టుల నుంచి నాయకులను కాపాడాలని అంబేద్కర్‌కు వినతిపత్రం సమర్పించారు.అనంతరం చెవిరెడ్డి స్వగృహం తుమ్మలగుంటకు వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి.. తామంతా వారి వెంటే ఉంటామని నియోజకవర్గపు కార్యకర్తలు భరోసా ఇచ్చారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, కూటమి ప్రభుత్వానికి అంతిమ ఘడియలు ప్రారంభం అయ్యాయని కార్యకర్తలు హెచ్చరించారు. చెవిరెడ్డి విడుదలయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.మరోవైపు.. చెవిరెడ్డి అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి స్పందించారు. ఈ క్రమంలో గురుమూర్తి ట్విట్టర్ వేదికగా..‘వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్ది అరెస్టు అక్రమం. కనీసం కేసుకు సంబందించిన ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అతి త్వరలో ప్రజాగ్రహానికి ఆహుతి కాక తప్పదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. @YSRCParty సీనియర్ నాయకులు Dr చెవిరెడ్డి భాస్కర్ రెడ్ది గారి అరెస్టు అక్రమం. కనీసం కేసుకు సంబందించిన ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు… pic.twitter.com/PgqNTGA8ND— Maddila Gurumoorthy (@GuruMYSRCP) June 18, 2025 -
వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు.. పల్నాడులో టెన్షన్!
సాక్షి, పల్నాడు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి కూటమి సర్కార్ కొత్త కుట్రలకు తెర లేపింది. ఆయన పర్యటనలకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించేందుకు కొత్త ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా.. ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనపై పోలీసులు సాయంతో కూటమి సర్కార్ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది.వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లా రెంటళ్లపాడు పర్యటన సందర్బంగా పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనకు కేవలం వంద మంది మాత్రమే రావాలంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, నిరసన, ధర్నా కాకపోయినా ఇలా.. పోలీసుల ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే స్వేచ్చ కూడా లేదా అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ద్వారా వైఎస్ జగన్ పర్యటనను కూటమి సర్కార్ నియంత్రించే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇక, వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు అనుమతి కోసం ఇప్పటికే ఏడు సార్లు జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు ఇలా ఆంక్షలు విధించడమేంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ఆదేశాల మేరకే వైఎస్ పర్యటనలను నియంత్రించేందుకు పోలీసులు ఇలా ఆదేశాలు జారీ చేశారని అటు ప్రజలు సైతం మండిపడుతున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన వద్దంటూ వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు నోటీసులు పంపించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పల్నాడు జిల్లా నేతలందరికీ నోటీసులు అందించారు. బుధవారం ఉదయం నుంచే వాహనాలను వెళ్లకుండా అడ్డంకులు సృష్టంచారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు. నరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుండి సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయడం లేదు. రెంటపాళ్ల ఊరిలోకి ఇతరులను రానీయకుండా అడ్డుకుంటున్నారు. గ్రామస్థులను కూడా ఆధార్ కార్డు చూపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇక, ఇప్పటికే రెంటపాళ్లకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు. -
కూటమి కొత్త ఎత్తుగడ.. చెవిరెడ్డి అక్రమ అరెస్ట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా కూటమి సర్కార్ అరాచకానికి తెగబడుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసింది. అంతటితో ఆగకుండా ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు చేసింది. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్ వారెంట్‌పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. తద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రం బట్టబయలైంది. ఈ అక్రమ కేసులో తాజాగా వెంకటేశ్ నాయుడు(ఏ34), బాలాజీ కుమార్ యాదవ్ (ఏ35), యద్దాల నవీన్ (ఏ36), హరీశ్ (ఏ37), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఏ38), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (ఏ39)లను నిందితులుగా చేరుస్తూ సిట్ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీం ఆదేశాలు, హెచ్చరికలు బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ బేతాళ కుట్ర ఇలా సాగుతోంది.కోర్టును తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను సిట్ నిందితులుగా చేర్చనేలేదు. కానీ, వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. నిందితులుగా చేర్చక పోయినా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం సిట్ బరితెగింపే. సొంత కంపెనీ పనిపై చెవిరెడ్డి మంగళవారం ఉదయం కొలంబో వెళ్లి.. తిరిగి బుధవారం సాయంత్రం వచ్చేలా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు.ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడులను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ38), వెంకటేశ్ నాయుడు (ఏ34)తోపాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు.అంటే బెంగళూరు విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులే కారు. అయినా సరే వారిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసి వారిని అడ్డుకోవడం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు పిలిచినా సిట్ విచారణకు రావడానికి సిద్ధమని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించారు. తన కోసం చిన్న చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, వేధించవద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్లు సిట్ రహస్యంగా లుక్ అవుట్ నోటీసులిచ్చి అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. -
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మహిళపై పచ్చ సైకోల అరాచకంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు.. ‘మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?. సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే.తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబు.., మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్‌బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు..@ncbn గారూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప… pic.twitter.com/GDVWPB65AZ— YS Jagan Mohan Reddy (@ysjagan) June 17, 2025 -
తాట తీస్తా.. తోలు తీస్తా.. అన్నావ్ కదా పవన్ ఇప్పుడు ఏమైంది?
సాక్షి,విశాఖ: రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతుంటే తాట తీస్తా.. తోలు తీస్తానన్న పవన్ కల్యాణ్ ఏమయ్యారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. ఆ ఘటనపై వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడారు.మహిళలు, బాలికలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయి. విశాఖలో టీడీడీపీ కార్యకర్త మహిళను వివస్త్ర చేసి దాడి చేసినా పట్టించుకోలేదు.సత్యసాయి జిల్లాలో బాలికపై లైంగికదాడికి పాల్పడింది టీడీపీ వాళ్లే. నిందితులు అధికార టీడీపీకి చెందిన వాళ్లే కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. రాష్ట్రంలో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై ఎవరైనా చేయివేస్తే తాట తీస్తానన్న పవన్ ఎక్కడున్నారు?మహిళల భద్రతను గాలికొదిలేశారు. హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారు?. రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇచ్చిన ప్రాధాన్యత మహిళల భద్రతకు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. -
‘ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ?’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళన చెట్టుకు కట్టేసిన అమానుష ఘటనపై మాజీ మంత్రి, ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చే రక్షణ ఇదేనా? చంద్రబాబు సర్కారును నిలదీశారు. చివరికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మహిళలకు భద్రత లేదని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొడితే ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?, ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ?, మహిళలపై అఘాయిత్యాలు చేస్తే అదే చివరి రోజని చంద్రబాబు బడాయి మాటలు చెప్తున్నారు. మరి ఆయన సొంత నియోజకవర్గంలో దారుణం జరిగితే చంద్రబాబు ఏం చేస్తున్నారు?, రాష్ట్రమంతా అరాచకం రాజ్యమేలుతోంది. మహిళ హోంమంత్రిగా ఉండికూడా ఉపయోగం లేదు. కుప్పం బాధిత మహిళను పరామర్శించే సమయం కూడా హోంమంత్రికి లేదా?, వీడియో కాల్ చేసి మాట్లాడటం హోంమంత్రి అహంకారానికి నిదర్శనం’ అని మండిపడ్డారు ఆర్కే రోజా. -
ధృతరాష్ట్ర పాలన.. ‘మమ్మల్ని ఎవడ్రా ఆపేది!’
ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనపాలన ఎలా ఉందో అర్థమవుతోందా? సూచాయిగా బాబుకు రాష్ట్రంలో సీను అర్థమైందా?.. తమ్ముళ్ల అరాచకాలు కనిపిస్తున్నాయా?.. వారిని కంట్రోల్ చేయలేక తమలపాకుతో కొడుతున్నారా? అసలిది ఆయన ప్రభుత్వమేనా.. లేక లోకేష్ మొత్తం పాలనను.. ప్రభుత్వాన్ని హైజాక్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చేస్తున్న పరిపాలనా ?..రాష్ట్రంలో పరిపాలన కన్నా కక్షలు.. కార్పణ్యాలు తీర్చుకోవడమే లక్ష్యంగా పడుతున్న తప్పుబడుగులను బాబు సరిదిద్దే పని చేయడం లేదా? దుర్యోధనుడి మాదిరిగా లోకేష్ అరాచకాలు సాగిస్తుంటే చంద్రబాబు కూడా పుత్రవాత్సల్యంతో దృతరాష్ట్రుడిలా చూడలేకపోతున్నారా ? ఇలాంటి సందేహాలు రాష్ట్రప్రజలను చుట్టుముడుతున్నాయి. గెలిచింది మొదలు లోకేష్ చేస్తున్న ప్రకటనలు, ప్రతిపక్ష నేతలు.. సోషల్‌మీడియా కార్యకర్తలమీద చట్టాన్ని అడ్డంపెట్టుకుని చేస్తున్న దాడులు .. కేసులు బాబుకు లీలగా కనిపిస్తున్నాయా ? వినిపిస్తున్నాయా ? అదే అనిపిస్తోంది.బాబుపాలనకు వచ్చి ఏడాదైన సందర్భంగా పలు ప్రయివేటు జిల్లాల్లో చేపట్టిన సర్వేల్లో ఘోరమైన ప్రజాభిప్రాయం వెల్లడవుతోంది. టీడీపీ నేతల అరాచకాలు.. దొమ్మీలు .. దోపిడీలు బాబు ప్రభుత్వ ప్రతిష్టను ఎలా దిగజారుస్తున్నదీ ఆ సర్వేలో వెల్లడింది.. ఘనవిజయం సాధించిన ఎమ్మెల్యేలు సైతం పెచ్చుమీరిన అవినీతిలో మునిగితేలియాడుతున్నారు. ఇదంతా ఇంటెలిజెన్స్ .. ఇతర సర్వే సంస్థల ద్వారా బాబు చెవిన పడిందా ?. ఇసుక.. గనులు.. వ్యాపారాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఎమ్మెల్యేలు కార్యకర్తల రుబాబు ఆకాశాన్ని తాకింది. ఈ వ్యతిరేకత అంతా తాజా సర్వేల్లో వెల్లడైంది. అయితే ఇది బాబు దృష్టికి వెళ్లిందని.. అందుకే విశాఖలో యోగా కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా అయన కార్యకర్త్తలను సున్నితంగా హెచ్చరించారని అంటున్నారు. గట్టిగా వార్ణింగ్ ఇవ్వలేక సుతిమెత్తగా తమలపాకుతో .. నెమలీకతో కొట్టినట్లుగా మెత్తని హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే అయన 'ఎమ్మెల్యేల పని తీరుపై మొన్న సర్వే చేయించా.. ప్రజల్లో రిపోర్టు బాగుంటే జిందాబాద్.. లేదంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా.. కార్యకర్తలే అధినేత.. ఇది సాధ్యం కావడం కోసం ఎమ్మెల్యేలు పని చేయాలి.. కార్యకర్తల నుంచి నివేదిక తెప్పించుకుంటా.. వాళ్ల మద్దతు లేకపోతే పక్కన పెడతా' అంటూ హెచ్చరికలు చేసారు. ఇలా చెబితే ఎవరు వింటారు.. మళ్ళా ఎవరి దందాల్లో వాళ్ళుంటారు.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ టీడీపీ నాయకులు... కార్యకర్తలు తల ఎగరేస్తున్నారు. ::: సిమ్మాదిరప్పన్న -
వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం
సాక్షి, పల్నాడు: పోలీసుల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కచ్చితంగా వస్తారని వైఎస్సార్సీపీ నేతలు కుండబద్ధలు కొట్టారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం మంగళవారం నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే జనం.. జనం అంటేనే జగన్. ఆయన వస్తున్నారంటే జనం ఆగరు. కానీ, జగన్ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారు. జగన్ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అయినా వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించడం ఖాయం’’ అని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు.కుట్ర ప్రకారమే జగన్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా అడ్డుకున్నామా?. మరి వైఎస్ జగన్ పర్యటన అంటే కూటమి ఎందుకు భయపడుతోంది?. నాగమల్లేశ్వరావును టీడీపీ నేతలు, పోలీసులు వేధించారు. అది భరించలేకే ఆయన సూసైడ్ చేసుకున్నారు. కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయి. ఈ అరాచక పాలన తట్టుకోలేకనే జనం రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా జగన్ పర్యటించడం ఖాయం అని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. -
రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. విధ్వంసకాండకు తెరతీసేలా
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో ఎల్లో గూండాలు రెచ్చిపోతున్నారు. విధ్వంసకాండకు తెరతీసేలా జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేయాలంటూ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నేతలను కొడితే దిక్కెవడంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు.సీఎం చంద్రబాబు 3 నెలలు మమ్మల్ని వదిలేయాలంటూ జేసీ వ్యాఖ్యానించారు. టీడీపీ విమర్శించేవారందరినీ ఉతికి ఆరేస్తామన్న జేసీ.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ గూండాగిరి ప్రదర్శించారు. -
‘వైఎస్ జగన్ పల్నాడుకు వెళ్తే.. బాబు సర్కార్‌కి భయమెందుకు?’
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటలను అడ్డుకునే కుట్ర జరుగుతోందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సత్తెనపల్లి వెళ్తే చంద్రబాబు సర్కార్‌కు ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటూ ఆయన ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించే హక్కు వైఎస్ జగన్‌కు ఉందన్నారు.‘‘స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యత మీదే. పొదిలిలో వైఎస్ జగన్‌కు వచ్చిన జన స్పందన చూసి టీడీపీ ప్రభుత్వం భయపడుతోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. చంద్రబాబు సర్కార్ బ్రిటీష్ చట్టాలను అమలు చేసి వైఎస్సార్సీపీని అణచి వేయాలని చూస్తోంది. 30 యాక్ట్ పేరుతో వైఎస్సార్ సీపీ నేతల పర్యటనలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం‘‘శాంతియుత నిరసనలు, సమావేశాలకు భారత రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కేసులు పెడతాం, పెట్టిస్తాం అంటూ పోలీసులు బెదిరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని శైలజానాథ్ పేర్కొన్నారు. -
చెవిరెడ్డిని ఇరికించేందుకే మదన్‌ను హింసించారు
సాక్షి, గుంటూరు: లిక్కర్ స్కాం కేసులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోంది ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి దగ్గర గతంలో గన్‌మెన్‌గా పని చేసిన మదన్‌ను దారుణంగా హింసించారని తెలిపారాయన. మంగళవారం ఉదయం తాడేపల్లిలో మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చెవిరెడ్డి పేరు చెప్పాలంటూ ఆయన మాజీ గన్‌మ్యాన్, హెడ్ కానిస్టేబుల్ అయిన మదన్‌ని చిత్రహింసలు పెట్టారు. మదన్ 10 ఏళ్లు చెవిరెడ్డి దగ్గర గన్‌మెన్‌గా పని చేశారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు మదన్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆయన మొహం మీద, వీపు మీద పిడిగుద్దులు గుద్దారు. చేతి వేళ్లు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని టార్చర్ పెట్టారు. .. సిట్ అధికారుల హింస వల్ల మదన్ ఆరు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ చిత్రహింసల గురించి మదన్ సీఎంతో పాటు రాష్ట్ర డీజీపీకి లేఖ కూడా రాశారు. ఆ లేఖలో వివరాలన్నీ క్షుణ్ణంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లబోతున్నాం’’ అని మనోహర్‌రెడ్డి మీడియాకు వివరించారు.నేడు హైకోర్టులో విచారణఏఆర్ కానిస్టేబుల్ మదన్ తరపున వైఎస్సార్సీపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో సిట్ అధికారులు బలవంతపు వాంగ్మూల సేకరణ జరుపుతున్నారని, భౌతిక దాడులకు దిగుతున్నారని, విచాచరణ పారదర్శకంగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని మదన్ ఆ పిటిషన్లో అభ్యర్థించారు. ఇదీ చదవండి: చంద్రబాబు ఇలాకాలో దారుణం -
పోలీసులతో మమల్ని అణచలేరు: అంబటి రాంబాబు
గుంటూరు: వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులతో అణచలేరని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు మాట్లాడారు. ‘సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు బెయిల్ పై విడుదల కావడం జరిగింది..సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు అనంతరం ఆయనను విడుదల చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశించింది..కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసుల పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. కేవలం చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రావటం లేదు అని కొమ్మినేని శ్రీనివాసరావు పై లక్ష్యకట్టి అరెస్ట్ చేశారు..చీమకి కూడా హాని చేయకుండా కలం కోసం పని చేస్తున్న జర్నలిస్ట్‌ను జైలులో పెట్టడం దుర్మార్గం. పోలీసుల అదుపులో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు పై అరమరావతి రాజధాని ప్రాంత ప్రజల ముసుగులో టీడీపీ గుండాలు దాడికి ప్రయత్నం చేశారు..రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత కేవలం మైక్ ముందే హోం మంత్రి.. ఇకపై డిబేట్లు పెట్టే అవకాశం లేదు అంటూ హోం మంత్రి అనిత మాట్లాడడం సిగ్గుచేటు. చీకటి పడిన తరువాత కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని చంద్రబాబు, లోకేష్ జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు..పోలీసులతో మమల్ని అణచలేరు’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు ఇక భయపడేదని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటనల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్ కామెంట్స్ చేశారాయన. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 18వ తేదీన రెంటపాళ్ల పర్యటనకు ఆటంకాలు కలిగిస్తోంది. జనాలను పంపి హింసకు ప్రేరేపించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు. ఈ క్రమంలోనే.. అనుమతి పేరిట విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారు. రెంటపాళ్లలో వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యుల పరామర్శకు జగన్ వెళ్తుంటే.. ప్రభుత్వం పిచ్చి చేష్టలకు దిగుతోంది. చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబాన్ని పరార్శించడానికే జగన్ వెళ్తున్నారు. తమ కార్యకర్త చనిపోతే.. పార్టీ అధినేత పరామర్శించటం తప్పా?. మేమేమీ బహిరంగ సభలకు వెళ్లటం లేదు. కానీ పోలీసుల వ్యవహారశైలి చూస్తుంటే జగన్ అసలు బయటకు రావటానికి వీల్లేదన్నట్టుగా ఉంది. పొదిలిలో కూడా రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. అంతేకానీ జగన్‌ను పర్యటించొద్దని అనడం కరెక్టు కాదు. జగన్ పర్యటనలో హింస సృష్టించేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అధికారం ఉందని అతిగా ప్రవర్తించద్దని ఆ తండ్రీకొడుకులకు చెప్తున్నాం. జనాన్ని పెట్టి కోడిగుడ్లు, టమోటాలు వేయించాలనుకోవటం దారుణం. జనాన్ని అణచి వేయాలనుకుంటే కుదరదు. చంద్రబాబు హెచ్చరికలు ఏపాటివో మా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. ఆయన రాజకీయాలను చూసి మేము భయపడేది లేదు’’ అని అంబటి అన్నారు. -
విద్యార్థుల జీవితాలతో ఆటలా చంద్రబాబు.. కూటమి ప్రభుత్వంపై రవిచంద్ర ఫైర్
సాక్షి,తాడేపల్లి: గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, ఈ ఏడాది కూడా అరకొర నిధులు ప్రకటించిన టీడీపీ కూటమి ప్రభుత్వం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయకుండా, వారి జీవితాలతో ఆడుకుంటోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆక్షేపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎ.రవిచంద్ర హెచ్చరించారు.ప్రెస్మీట్లో ఎ.రవిచంద్ర ఇంకా ఏం మాట్లాడారంటే..:విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలు: విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేయలేదు. ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నాయి. మరోవైపు దీనిపై ఇప్పటికే సమావేశమైన ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. ఇందులో అధికార పార్టీ నాయకులకు చెందిన కాలేజీలు కూడా ఉన్నాయి. విద్యార్థుల తరఫున చెల్లించాల్సిన ఫీజుకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్, ఆ మాట నిలబెట్టుకోకుండా.. ఏడాది పాలన ఘనతలంటూ డప్పుకొట్టుకోవడం దారుణం. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఐదేళ్ల కాలంలో అమలు చేసిన విద్యా సంస్కరణలను ఏడాదిలోనే నాశనం చేశారు. విద్యార్థులకు విద్యాదీవెన కిట్లు కూడా సకాలంలో అందని పరిస్థితి నెలకొంది. పరీక్షలు కూడా విజయవంతంగా నిర్వహించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీల భూములపై కన్నేసి కాజేయడానికి టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. పిల్లల చదువులను ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవడం లేదు.విద్యార్థుల బకాయిలు రూ.6,400 కోట్లు: 2024 ఏప్రిల్ నుంచి 2025 జూన్ 16 నాటికి ఆరు త్రైమాసికాలకు సంబంధించి విద్యార్థులకు ప్రభుత్వం రూ.6,400 కోట్లు బకాయి పడింది. అందులో రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కాగా, రూ.2,200 కోట్లు స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తం ఎప్పటిలోపు చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. ఫీజు బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేయని కారణంగా పేద విద్యార్థులు చదువులు మధ్యలోనే ఆపేయాల్సిన దుస్థితి నెలకొంది. కొందరు విద్యార్థులు ఫీజులు కట్టుకోవడం కోసం కూలీ పనులకు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక క్వార్టర్లీ ఫీజు చెల్లింపు విధానాన్ని రద్దు చేసి హాఫ్ ఇయర్లీ విధానం తీసుకొచ్చారు. తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీల ఖాతాల్లోనే విద్యార్థుల ఫీజులు జమ చేస్తామని చెప్పారు. రెండుసార్లు గడువు పూర్తయినా విద్యార్థుల తరఫున ప్రభుత్వం ఫీజులు జమ చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి. పరీక్షలప్పుడు హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో అంగీకార పత్రాలు రాయించుకుని వారిని పరీక్షలకు పంపించిన దుస్థితికి రాష్ట్ర విద్యావ్యవస్థను తీసుకెళ్లారు.అబద్ధాలు చెబుతున్న ప్రభుత్వం: రెండు క్వార్టర్ల ఫీజు చెల్లించామని ఈ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. వాస్తవానికి ఏడాది కాలంలో కేవలం ఒకటిన్నర క్వార్టర్ ఫీజును మాత్రమే జమ చేసింది. ఒక క్వార్టర్ పూర్తిగా ఇచ్చి ఇంకో క్వార్టర్ సగం మాత్రమే చెల్లించి రూ.300 కోట్లు పెండింగ్ పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏటా రూ.2,800 కోట్లు, స్కాలర్షిప్ కింద మరో రూ.1,100 కోట్లు.. అలా ఏటా మొత్తం రూ.3,900 కోట్ల చొప్పున రెండేళ్లకు కలిపి రూ.7800 కోట్లు చెల్లించాలి. కానీ కూటమి ప్రభుత్వం ఒకటిన్నర క్వార్టర్ ఫీజు మాత్రమే చెల్లించి రూ.6400 కోట్లు పెండింగ్ పెట్టింది. ఈ ఏడాది బడ్జెట్లో అరకొరగా రూ.2,600 కోట్ల కేటాయింపు చూపినా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా విద్యార్థుల చదువులను గాలికొదిలేసింది.ఐదేళ్లలో రూ.18 వేల కోట్లు చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వం: గత వైస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి త్రైమాసికానికి రూ.720 కోట్ల చొప్పున ఎప్పటికప్పుడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమయ్యేది. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో నిధులు ఎప్పుడు జమ చేసేది కూడా పత్రికల ద్వారా నాటి జగన్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పడంతో విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా ఐదేళ్ల చదువులు సాఫీగా సాగిపోయాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పేద పిల్లల చదువులను సమస్యలు చుట్టుముట్టాయి. గతంలో ఏ కాలేజీ యాజమాన్యం, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక కాలేజీల యాజమాన్యాలు మూడుసార్లు మంత్రి నారా లోకేష్‌ని కలిసి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల చేయాలని కోరినా ఫలితం లేదు. 2019–24 మధ్య విద్యాదీవెన కింద 29,65,930 మంది విద్యార్థులకు రూ.12,608 కోట్లు, వసతి దీవెన కింద రూ.4,276 కోట్లు చెల్లించారు. మొత్తంగా 54,83,175 మంది పిల్లలకు 5 ఏళ్లలో రూ.16 వేల కోట్లకు పైగా చెల్లించారు. దీంతోపాటు 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,778 కోట్లు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. పిల్లల చదువుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ విడుదల చేయాలని, లే పక్షంలో విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఎ.రవిచంద్ర హెచ్చరించారు.