దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 802.74 పాయింట్లు లేదా 1.07 శాతం నష్టంతో 74,435.25 వద్ద, నిఫ్టీ 242.45 పాయింట్లు లేదా 1.03 శాతం నష్టంతో 23,401.05 వద్ద కొనసాగుతున్నాయి.
రీజెన్సీ సిరామిక్స్ లిమిటెడ్, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, బీఎన్ ఆగ్రోకెమ్ లిమిటెడ్, సుప్రీం హోల్డింగ్స్ & హాస్పిటాలిటీ (ఇండియా) లిమిటెడ్, ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హింద్ రెక్టిఫయర్స్ లిమిటెడ్, క్యూబెక్స్ ట్యూబింగ్స్ లిమిటెడ్, బైడ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఏథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


